Women's Squads Named for West Indies Tour విండీస్ పర్యటనకు టీమిండియా నుంచి వీళ్లే..

Mithali raj harmanpreet kaur to lead india teams in west indies tour

mithali raj, harmanpreet kaur, mithali raj cricket, harmanpreet kaur cricket, cricket news, india cricket, cricket india, india cricket news, harmanpreet kaur news, india women vs west indies women, cricket, sports, latest cricket news, Sports news, latest sports news, Cricket news, cricket

Mithali Raj and Harmanpreet Kaur will lead the Indian women’s ODI and T20 teams respectively their upcoming tour of West Indies, the BCCI said in a statement.

విండీస్ పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటన

Posted: 09/27/2019 09:18 PM IST
Mithali raj harmanpreet kaur to lead india teams in west indies tour

వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టుని బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది. నవంబరు 1 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ని భారత జట్టు ఆడనుండగా.. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వన్డే జట్టు, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ‌లో టీ20 జట్టుని బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. వన్డేలపై ఎక్కువ దృష్టి నిలిపేందుకు ఇటీవల టీ20లకి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం ఐదు టీ20ల సిరీస్‌ ఆడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు.. 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందగా.. రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక మూడో టీ20 మ్యాచ్ సూరత్ వేదికగా ఆదివారం జరగనుంది.

వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మందన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పునం రౌత్, డి హేమలత, జులన్ గోస్వామి, శిఖా పాండే, మాన్సీ జోషి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాజేశ్వరి గయక్వాడ్, తానియా భాటియా (వికె), ప్రియా పునియా, మరియు సుష్మా వర్మ.

టీ20 జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందన (వైస్ కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికె), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, వేద కృష్ణమూర్తి, అనుజా పాటిల్ , మాన్సీ జోషి, మరియు అరుంధతి రెడ్డి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TeamIndia  women cricket  Ind w vs wi w 2019  bcci  womens squad  west indies tour  cricket  sports  

Other Articles