Ambati Rayudu to return to cricket గుడ్ బైకి వీడ్కోలు పలికిన అంబటి రాయుడు

Ambati rayudu to return to cricket will play for hyderabad

TeamIndia, Ambati Thirupathi Rayudu, Ambati Rayudu, Retirement, Hyderabad, Ambati Rayudu, Rayudu retirement, Hyderabad Cricket Association, World Cup squad, retirement withdrawal, Cricket, sports, cricket news, sports news

Ambati Rayudu has written to the Hyderabad Cricket Association (HCA), saying his decision to retire was an emotional one and that he now is available for selection.

గుడ్ బైకి వీడ్కోలు పలికిన అంబటి రాయుడు

Posted: 08/30/2019 08:59 PM IST
Ambati rayudu to return to cricket will play for hyderabad

టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌ సమయంలో తనని సెలక్టర్లు పదే పదే పక్కన పెట్టడంతో నిరాశ చెందిన రాయుడు.. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకీ గత నెల ఆరంభంలో రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అయితే.. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్న ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ)కి లేఖ రాశాడు. రాయుడి నిర్ణయానికి హెచ్‌సీఏ నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించింది.

టీమిండియా సెలక్టర్లు తనను ఎంపిక చేయకుండా పదే పదే పక్కన బెట్టడంతో ఆయన తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ఆ తరువాత తన నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అధికారికంగా రూడి అయ్యింది. రిటైర్మెంట్ ప్రకటించిన 58 రోజుల్లోనే ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ తన నిర్ణయాన్ని మార్చుకోగా.. హైదరాబాద్ తరఫున 2019-20 రంజీ సీజన్‌లో రాయుడు మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంది. అయితే.. మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం దేశవాళీ క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది.

భారత్ జట్టులోకి 2013లో ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు.. కెరీర్‌లో ఇప్పటి వరకూ 55 వన్డే మ్యాచ్ లు ఆడి.. మూడు శతకాలు, 10 అర్ధశతకాలు సాధించాడు. సుదీర్ఘ కెరీర్ లో కనీసం ఒక్క అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన ఈ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ ఆరు టీ20లు కూడా ఆడాడు. కానీ.. మొత్తం చేసిన పరుగులు 42 మాత్రమే. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. యువ క్రికెటర్లకి ఎక్కువ అవకాశాలివ్వడంపై సెలక్టర్లు శ్రద్ధ పెడుతుండటంతో 33 ఏళ్ల రాయుడికి మళ్లీ ఛాన్స్‌ దక్కడం కష్టమే..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TeamIndia  Ambati Thirupathi Rayudu  Ambati Rayudu  Retirement  Hyderabad  Cricket  sports  

Other Articles