Pollard Fined For Showing Dissent to Umpires బ్యాట్ ఎగురవేసిన పోలార్డ్.. ఫీజులో కొత

Ipl 2019 final pollard fined for showing dissent to umpires

IPL 2019, IPL final, MI vs CSK, Kieron Pollard, Pollard fined, Umpire, IPL controversy, cricket, cricket news, sports news, latest sports news, sports

IPL 2019 final, MI vs CSK: Kieron Pollard was fined 25 per cent of his match fee for showing dissent toward the umpire during the IPL 2019 final which Mumbai Indians won.

మ్యాచ్ మధ్యలో బ్యాట్ ఎగురవేసిన పోలార్డ్.. ఫీజులో కొత

Posted: 05/13/2019 07:24 PM IST
Ipl 2019 final pollard fined for showing dissent to umpires

ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌కు జరిమానా పడింది. ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘన కింద అతనికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్‌ యాజమాన్యం తెలిపింది. టాపార్డర్ కుప్పకూలిన వేళ పొలార్డ్ ఒక్కడే క్రీజులో పాతుకుపోయాడు. వీలు కుదిరినప్పుడల్లా షాట్లు బాదుతూ జట్టుకు పరవాలేదనిపించే స్కోరు నమోదు చేశాడు. ఈ క్రమంలో చివరి ఓవర్‌లో కట్టడి చేసేందుకు ధోనీ.. బ్రావోకు బౌలింగ్ అప్పగించాడు. 19.1 బాల్‌ను అటెంప్ట్ చేశాడు పొలార్డ్. వైడ్ గా విసిరిన బంతిని అంఫైర్ వైడ్ ప్రకటించలేదు.

తర్వాతి బంతిని అదే విధంగా వేయడంతో అటెంప్ట్ చేయకుండా వదిలేశాడు. అయినా దానిని వైడ్‌గా ప్రకటించలేదు. దీంతో అసహనానికి గురైన పొలార్డ్‌ బ్యాట్‌ను గాల్లోకి విసరేశాడు. ఆ తర్వాత బంతి వేసేందుకు బ్రావో పరుగెత్తున్న సమయంలో క్రీజులో ఉన్న పొలార్డ్‌.. అంపైర్‌ నిర్ణయాన్ని అవహేలన చేసేలా.. వైడ్‌ను దాటి నడుస్తూ వెళ్లిపోయాడు. అంపైర్లు పొలార్డ్ వద్దకు వచ్చి వివరణ అడిగి వెళ్లిపోయారు.

ఆ తర్వాత బంతికే మరో ఎండ్‌లో ఉన్న మెక్ క్లెనగన్ అవుట్ అవడంతో మిగిలిన 2బంతులను బౌండరీకి పంపించాడు పొలార్డ్. దీంతో ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘన కింద పొలార్డ్‌కు మ్యాచ్‌ ఫీజులో 25శాతం కోత పడింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌ లో పొలార్డ్ 25 బంతుల్లోనే 41 పరుగులు చేసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2019  IPL final  MI vs CSK  Kieron Pollard  Pollard fined  Umpire  IPL controversy  cricket  

Other Articles