Rohit Sharma fined for breach of conduct వికెట్లను (రో)‘హిట్’ చేసిన ముంబై కెప్టెన్ కు జరిమానా..!

Ipl 2019 rohit fined 15 of match fee for hitting stumps after dismissal

Cricket, Indian Premier League, Rohit Sharma, Kolkata Knight Riders, Mumbai Indians, Suryakumar Yadav, Mumbai Indians skipper, Mumbai, Harry Gurney, Mumbai Indians captain, Hardik Pandya, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Mumbai Indians captain Rohit Sharma has been fined 15 per cent of his match fees for breach of code of conduct during a match against Kolkata Knight Riders (KKR) in the ongoing edition of the Indian Premier League (IPL).

వికెట్లను (రో)‘హిట్’ చేసిన ముంబై కెప్టెన్ కు జరిమానా..!

Posted: 04/29/2019 07:28 PM IST
Ipl 2019 rohit fined 15 of match fee for hitting stumps after dismissal

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు దెబ్బ మీద దెబ్బ. ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ కు బెర్త్ ఖాయం అనుకుంటున్న తరుణంలో కోల్‌కతా చేతిలో ఘోరంగా దెబ్బతింది.. 34 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇది చాలదన్నట్లు రోహిత్ శర్మపై బీసీసీఐ మరో భారం వేసింది.

(కోడ్ ఆఫ్ కండక్ట్ వయోలేషన్) బీసీసీఐ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన రోహిత్ శర్మ(12; 8బంతుల్లో)మాత్రమే చేయగలిగాడు. 4వ ఓవర్ బౌలింగ్ వేస్తున్న హ్యారీ గర్నీ ఫుల్ లెంగ్త్ డెలివరీని సంధించాడు. నేరుగా బంతి వెళ్లి అతని కాలికి తగిలింది. వెంటనే అంపైర్ నితిన్ మీనన్ దానిని అవుట్‌గా ప్రకటిస్తూ వేలెత్తాడు.

రోహిత్ దీనిపై రివ్యూ కోరగా, అందులో క్లియర్‌గా అవుట్ అని కనిపించింది. కానీ, అవుట్ అయ్యాననే నిరుత్సాహంలో ఊగిపోయిన రోహిత్.. బౌలర్ వైపు స్టంప్లను బ్యాట్‌తో కొట్టుకుంటూ వెళ్లిపోయాడు. బెయిల్స్ కిందపడేంత బలంగా కొట్టడంతో.. అతనిపై ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1అఫెన్స్ 2.2 కింద చర్యలు తీసుకున్నారు. ఈ చర్యతో రోహిత్.. అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధోనీ.. కోహ్లీల జాబితాలో చేరిపోయాడు. ముంబై ఇండియన్స్ చేధనలో విఫలమై 34 పరుగుల తేడాతో ఓటమికి గురైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles