IPL 2019: Ball lost on field, found in umpire's pocket స్టేడియంలో నవ్వులు పూయించిన అంఫైర్ శంషుద్దీన్

Ipl 2019 umpires at it again this time they forgot where they kept the ball

Ab de Villiers, Ankit Rajpoot, IPL, IPL 2019, KXIP,RCB, Umpires, Umpire Shamsuddin, Ravichandran Ashwin, M Chinnaswamy Stadium, IPL (Indian Premier League),KXIP (Kings XI Punjab),RCB (Royal Challengers Bangalore), cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

The match between RCB and KXIP was an interesting IPL affair as the game went down to the last over, but there was another incident that happened during the match that took the limelight away.

స్టేడియంలో నవ్వులు పూయించిన అంఫైర్ శంషుద్దీన్

Posted: 04/25/2019 04:21 PM IST
Ipl 2019 umpires at it again this time they forgot where they kept the ball

ఐపీఎల్‌ సీజన్ లో అంపైర్లు పదేపదే వార్తల్లో నిలుస్తున్నారు. నోబాల్‌ వివాదాలతో మొన్నటిదాకా విమర్శలు ఎదుర్కొన్న అంపైర్లు తాజాగా క్రితం రోజు రాత్రి జరిగిన మ్యాచ్ లో స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు టీవీల ముందకు కూర్చోని మ్యాచ్ ను వీక్షించిన అభిమానులందరినీ నవ్వుల్లో ముంచారు. అయితే ఇలా వారు కావాలని చేసింది కాదు. కేవలం కాకతాళీయంగా జరిదినదే.. అంపైర్ ‘గజనీ’ అవతారం ఎత్తడంతో.. కాసేపు స్టేడియంలో నవ్వులు విరిసాయి. ఆ తరువాత తనతో జరిగిన తప్పు తెలుసుకన్న అంపైర్ నాలుక కర్చుకున్నాడు.

అసలేం జరిగిందంటే..

బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కింగ్స్ ఎలివెన్ పంజాబ్ జట్టుకు మధ్య మ్యాచ్ జరుగింది. ఈ క్రమంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కింగ్స్ లెవన్ జట్టు.. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా పదమూడు ఓవర్లు వేసిన తరువాత అంపైర్ టైమ్ అవుట్ బ్రేక్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో శంషుద్దీన్‌, బ్రూస్‌ ఆక్సెన్‌ఫర్డ్‌ అంపైర్లుగా వ్యవహరించారు. తొలి ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్‌ వేసేందుకు పంజాబ్‌ బౌలర్‌ అంకిత్‌ రాజ్ పుత్‌ సిద్ధమయ్యాడు. బంతి కోసం కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను అడిగాడు. ఆటగాళ్లెవరి దగ్గరా బంతి లేకపోవడంతో అశ్విన్‌ అంపైర్‌ శంషుద్దీన్‌ను సంప్రదించాడు.

బంతి కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఇక లాభంలేదని భావించిన అంపైర్లు కొత్త బంతి తీసుకురావాలని కోరారు. సిబ్బంది బాల్‌ కిట్‌తో మైదానంలోకి ప్రవేశించారు. ఈ సమయంలో థర్డ్‌ అంపైర్‌ బంతి కోసం పెద్ద స్క్రీన్‌లో రిప్లే వేశాడు. అయితే, ఆ వీడియోలో శంషుద్దీన్‌ జేబులోనే బంతి ఉన్నట్లు తేలింది. స్ట్రాటెజిక్‌ టైమ్‌ ఔట్‌ సమయంలో బంతిని తీసుకున్న అంపైర్‌ శంషుద్దీన్‌.. దాన్ని తన జేబులో వేసుకున్నాడు. కానీ, ఆ విషయం మరిచిపోయాడు. ఇదంతా రిప్లేలో చూసి ఆటగాళ్లతో పాటు మైదానంలో ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూశాయి. పొరపాటును తెలుసుకున్న ఆ అంపైర్‌ కొత్తబంతిని తీసుకొస్తున్న సిబ్బందిని వెనక్కి పంపించాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KXIP vs RCB  IPL 2019  Umpire Shamsuddin  Ravichandran Ashwin  M Chinnaswamy Stadium  sports  cricket  

Other Articles