Dhoni accepts Rishabh Pant's challenge పంత్ కు ధోని స్వీట్ వార్నింగ్.. నెట్టింట్లో వీడియో వైరల్

Ipl 2019 ms dhoni accepts rishabh pant s challenge with a reminder

Indian premier league, IPL, MS Dhoni, Rishabh pant, Delhi captains, Chennai super kings, , cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Veteran wicketkeeper-batsman and Chennai Super Kings captain MS Dhoni has given a fitting reply to Rishabh Pant's warning video ahead of the Indian Premier League (IPL) 2019.

పంత్ కు ధోని స్వీట్ వార్నింగ్.. నెట్టింట్లో వీడియో వైరల్

Posted: 02/28/2019 06:27 PM IST
Ipl 2019 ms dhoni accepts rishabh pant s challenge with a reminder

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 12 మొదలయ్యేందుకు నెల రోజుల సమయమున్నా.. అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్ ఇప్పుడే మొదలైపోయింది. వారికి తగ్గట్టుగానే ఫ్రాంచైజీలు అదే స్థాయిలో ప్రచారంతో ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. ఈ మధ్యనే రిషబ్ పంత్.. ఎంఎస్ ధోనీకి వార్నింగ్ ఇస్తున్నట్లుగా చేసిన వీడియోను విడుదల చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ముందడుగేస్తే.. ధీటుగా సమాధానం చెప్తూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో వీడియో విడుదల చేశాడు.

'మహీ భాయ్.. అన్నీ నీ నుంచే నేర్చుకున్నాను. ఇప్పుడు నీ ముందే ఆడేందుకు సిద్ధమవుతున్నాను. ఐపీఎల్ లో కలుసుకుందాం. ఏమంటావ్..' అని ఢిల్లీ యువ సంచలనం రిషబ్‌ పంత్ ట్వీట్ చేశాడు. దానికి స్పందంచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. 'నేను ఆడటం మొదలుపెట్టినప్పుడు ఇలాగే అనుకునేవాడిని. రా రిషబ్. వికెట్ వెనకాల నేనే ఉంటాగా చూసుకుందాం' అని బదులిచ్చాడు.

ఈ వీడియోలో ఐపీఎల్‌ సమరానికి బయల్దేరుతున్నట్లుగా ఉన్న మిస్టర్ కూల్ తస్మాత్ జాగ్రత్త అన్న స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ కనిపించాడు. పంత్ వీడియోతో కంటే ధోనీ వీడియో మరింత వేగంగా వైరల్ అవుతోంది. కొద్ది రోజుల ముందు బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఐపీఎల్ మార్చి 23నుంచి ఆరంభం కానుంది. సొంతగడ్డపైనే సీజన్ ఆరంభిస్తున్న చెన్నై.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచులో తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian premier league  IPL  MS Dhoni  Rishabh pant  Delhi captains  Chennai super kings  sports  cricket  

Other Articles