Tim Paine Dares Rohit Sharma To Hit A Six రోహిత్ ఏకాగ్రతను దెబ్బతీసే యత్నంచిన అసీస్ కెప్టెన్

Tim paine dares rohit sharma to hit a six vows to support mumbai indians

Tim Paine, Rohit Sharma, Mumbai Indians, Melbourne Test, IPL, India vs Australia, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Australia captain Tim Paine was chirpy behind the stumps against India again at the MCG, caught trying to tempt Rohit Sharma into a wild shot.

రోహిత్ ఏకాగ్రతను దెబ్బతీసే యత్నంచిన అసీస్ కెప్టెన్

Posted: 12/27/2018 05:03 PM IST
Tim paine dares rohit sharma to hit a six vows to support mumbai indians

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో భారత బ్యాట్స్ మన్ అద్భుతంగా రాణించారు. అసీస్ తో టెస్టు క్రికెట్ అరంగ్రేటం చేసిన ఓపెనర్ హనుమ విహారి మినహా టాప్, మిడిల్ అర్ఢర్ బాగా రాణించి.. టీమిండియాను పటిష్టస్థితిలో వుంచారు. అయితే భారత బ్యాట్స్ మెన్లు బాధ్యతాయుతంగా అడుతుండటంతో.. మైండ్ బ్లాక్ అయిన అసీస్.. అతి తెలివితేటలను ప్రదర్శించారు. రోహిట్ మాన్ రోహిత్ శర్మ అడుతుండగా, వికెట్ల వెనుకనుంచి అతడ్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

రోహిత్ శర్మ సరిగ్గా 34 బంతులు అడి 13 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద వుండగా, ఆయన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కుటిలయత్నం చేశారు. ఆసీస్ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ వికెట్ల వెనకాల నుంచి ఈ ప్రయత్నాలు సాగించాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో రోహిత్‌ను టీజ్ చేయడం మొదలుపెట్టాడు. ఐపీఎల్‌ను ముడిపెడుతూ రోహిత్‌‌కు సవాల్ విసిరాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ లెగ్‌లో ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇతను గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. ఫించ్‌, రోహిత్‌ మధ్య పోటీ పెడుతూ.. ‘నా ఓటు రాయల్స్‌కా, ఇండియన్స్‌కా ఇప్పుడు తేలిపోతుంది. రోహిత్ ఇప్పుడు సిక్స్ కొడితే నేను ముంబైకి మారిపోతా’ అని పైన్ అన్నాడు.

పైన్ ఆ మాట అన్న తరవాత రెండు బంతులను రోహిత్ డిఫెన్స్ ఆడాడు. రోహిత్‌ను టిమ్ పైన్ టీజ్ చేసిన మాటలు వికెట్ల దగ్గర మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ సంభాషణలు కాస్త నవ్వు తెప్పిస్తున్నాయి. కాగా, రహానే ఔటైన తరవాత రిషబ్ పంత్(39)తో కలిసి రోహిత్ ఐదో వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. రిషబ్ పంత్ ఔటైన తరవాత క్రీజులోకి వచ్చిన జడేజా(4)ను హాజల్‌వుడ్ ఔట్ చేశాడు. దీంతో 443/7 వద్ద భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tim Paine  Rohit Sharma  Mumbai Indians  Melbourne Test  IPL  India vs Australia  sports  cricket  

Other Articles