Mayank Agarwal crosses many milestones on debut 71 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన మయాంక్ అగర్వాల్

Melbourne test day one many milestones crossed by mayank agarwal on debut

Mayank Agarwal, debut test, India vs Australia, KL Rahul, Murali Vijay, Dattu Phadkar, Cheteshwar Pujara, cricket, cricket news, sports news, latest sports news, sports

Debutant Mayank Agarwal produced a confident 76-run knock before falling at the stroke of tea as India made a steady start to the third Test against Australia in Melbourne

71 ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన మయాంక్ అగర్వాల్

Posted: 12/26/2018 09:11 PM IST
Melbourne test day one many milestones crossed by mayank agarwal on debut

టెస్ట్ అరంగేట్రంలోనే మయాంక్ అగర్వాల్ 71 ఏళ్లనాటి రికార్డును బద్దలు కొట్టి తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో తన ఖాతాలో రికార్డులు వేసుకున్నాడు. మెల్ బోర్న్ వేదికగా ఇవాళ ప్రారంభమైన మూడవ, బాక్సింగ్ డే టెస్ట్‌లో ఓపెనర్ గా వచ్చిన మయాంక్.. తొలి ఇన్నింగ్స్‌లోనే 76 పరుగులు చేసి రాణించాడు. గత రెండు టెస్టుల్లో పరుగులు సాధించడానికి మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఇబ్బంది పడగా.. మయాంక్ మాత్రం చాలా సులువుగా పరుగులు సాధించాడు.

ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్ మన్ లాగా ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. బౌన్సర్లతో బెంబేలెత్తించినా బెదరకుండా క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్ర టెస్ట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా మయాంక్ నిలిచాడు. ఈ క్రమంలో ఎప్పుడో 71 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టడం విశేషం. 1947లో దత్తు ఫడ్కర్ సిడ్నీ టెస్ట్‌లో అరంగేట్రం చేసి 51 పరుగులు చేశాడు. ఇన్నాళ్లూ ఇవే అత్యధిక పరుగులుగా ఉన్నాయి.

మయాంక్ దెబ్బకు ఇప్పుడా దశాబ్దాల రికార్డు తెరమరుగైంది. 27 ఏళ్ల మయాంక్.. క్రీజులో ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ముఖ్యంగా తొలి రెండు టెస్టుల్లో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన స్పిన్నర్ నాథన్ లయన్‌పై అతడు ఎదురు దాడికి దిగాడు. అతని బౌలింగ్‌లోనే ఓ సిక్స్ కూడా బాదాడు. లయన్ వేసిన మరో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. ఈ క్రమంలో ఓపెనర్ విహారితో కలిసి తొలి వికెట్ కు 40 పరుగులు, పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగులు జోడించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మయాంక్కు మంచి రికార్డు ఉంది. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mayank Agarwal  debut test  India vs Australia  KL Rahul  Murali Vijay  Cheteshwar Pujara  cricket  

Other Articles