India vs Australia: Cheteshwar Pujara Lone Effort ఒంటిచేత్తో జట్టును అదుకున్న పూజారా..

India vs australia pujara wages lone battle with 16th test ton

india vs australia, india vs australia 1st test day 1, india australia test match, india australia test match score, cheteshwar pujara, cheteshwar pujara century, cricket news, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Cheteshwar Pujara showed varying levels of batting discipline on the first day of the opening Test against Australia. He was patient when the ball was doing plenty in the morning session and wickets were falling, and later picked up the pace with the tail.

కంగారెత్తించిన కంగారులు.. ఒంటిచేత్తో జట్టును అదుకున్న పూజారా..

Posted: 12/06/2018 05:56 PM IST
India vs australia pujara wages lone battle with 16th test ton

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ ప్రారంభమైన తొలిటెస్టులో చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా పూర్తిగా చేతులెత్తేసినా.. గౌరవప్రదమైన స్కోరును ఎట్టకేలకు సాధించింది. తొలిరోజు అద్యంతం అసీస్ బౌలర్ల హవా కొనసాగింది. కంగారు బౌలర్లు టీమిండియా బ్యాట్స్ మెన్ ను కంగారుపెట్టడంలో సఫలీకృతమైనా.. ఒంటి చేత్తో మ్యాచ్ తొలిరోజున టీమిండియాను చెప్పకోదగిన స్కోరుకు చేర్చాడు ఛట్టేశ్వర్ పూజరా. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 250 రన్స్ చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా..  టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో లంచ్ టైంకు నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 56 రన్స్ మాత్రమే చేసింది.నాలుగు వికెట్లు కోల్పోయిన టైంలో క్రీజ్ లోకి వచ్చిన  రోహిత్‌ శర్మ-రిషబ్‌ పంత్‌లు కాసేపు టీంను ఆదుకునే ప్రయత్నం చేశారు. తర్వాత వీరిద్దరూ ఔటవ్వడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. అయితే తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఛటేశ్వర్ పూజారా తన సూపర్ సెంచరీ(123)తో టీమిండియాను ఆదుకున్నాడు.

ఈ సెంచరీతో పూజారా తన టెస్ట్ కెరీర్ లో 16వ సెంచరీని కంప్లీట్ చేశాడు.ఒకవైపు పేస్‌ అటాక్‌ను, మరొకవైపు స్పిన్‌ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆసీస్‌ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. భారత టీంలో లోకేష్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), పూజారా(123), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్‌ శర్మ(37), రిషబ్‌ పంత్‌(25), అశ్విన్(25), ఇషాంత్ శర్మ(4) రన్స్ చేశారు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో షమీ (6), బుమ్రా (0) ఉన్నారు. ఆసీస్ బౌల‌ర్లలో, మిచెల్ స్టార్క్,హాజిల్‌వుడ్‌, పాట్ క‌మిన్స్ , నాథన్ లియాన్‌ రెండేసి వికెట్లు తీశారు.

There it is, a brilliant ton for Cheteshwar Pujara from 231 balls!

That's his 16th hundred in Test cricket and third against Australia.#AUSvIND | @Domaincomau pic.twitter.com/cD1rSObzGq

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles