టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడటం ఖాయమే! పదకొండేళ్ల తర్వాత అతడు ఢిల్లీకి ఆడుతుండటం విశేషం. గతేడాది వేలంలో ఆర్టీఎం విధానంలో ధావన్ ను రూ.5.2 కోట్లకు సన్ రైజర్స్ తీసుకుంది. ఎక్కువ ధరకు తనను రీటెయిన్ చేసుకోలేదని గబ్బర్ సన్ రైజర్స్ కోచ్‌తో వాగ్వాదానికి దిగినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడిని ట్రేడాఫ్ విధానంలో తీసుకొనేందుకు పలు జట్టు ముందకువచ్చాయి.
వీటిలో ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు కూడా వున్నాయి. అయితే అందివచ్చిన అవకాశంతో తమ జట్టు ఫలితాన్ని తొలి బంతి నుంచే మార్చాలని భావించిందో ఏమో తెలియదు కానీ.. ఢిల్లీ డేర్ డెవిల్స్ అనూహ్యంగా ముందుకోచ్చి ధావన్ ను దక్కించుకుందని అభిజ్ఞవర్గాల సమాచారం. ధావన్ కు బదులుగా ఢిల్లీ నుంచి షాబాజ్ నదీమ్, విజయ్ శంకర్, అభిషేక్ వర్మను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకోనుంది. ఈ విషయంలో సన్‌రైజర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని సమాచారం.
దేశవాళీ క్రికెట్‌లో మంచి పేరున్న నదీమ్ (రూ.3.2 కోట్లు)ను భారత స్పిన్నర్ కోటాలో వినియోగించుకోనుంది. ఇక ఏడాది అంతరం తర్వాత విజయ్ శంకర్ (రూ.3.2 కోట్లు) తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నాడు. అతడు తన ఆల్‌రౌండ్ సేవలతో జట్టును మరింత పటిష్ఠం చేయనున్నాడు. ఇక యువ అభిషేక్ వర్మ (రూ.55 లక్షలు) మిడిలార్డర్‌లో ఉపయోగపడతాడు. ఈ ముగ్గురికి ఇవ్వాల్సిన మొత్తం రూ.6.95 కోట్లు. ధావన్ విలువ రూ.5.2 కోట్లు. మిగిలిన డబ్బును దిల్లీకి హైదరాబాద్ చెల్లించాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్‌లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more
May 27 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్... Read more