Dhoni is fit but his form is suspect టీమిండియా జట్టులో ఇద్దరు కీపర్లెందుకు.?

India cannot have two wicketkeepers in the team dilip vengsarkar

MS Dhoni, Dhoni, Dhoni form, Dilip Vengsarkar, India vs West Indies, India vs West Indies 4th ODI, Indian national cricket team, West Indies national cricket team, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

MS Dhoni's poor form with the bat has put his under the scanner in the ongoing series against West Indies as he looks to put behind his struggles and deliver in the middle order.

టీమిండియా జట్టులో ఇద్దరు కీపర్లెందుకు.?

Posted: 10/29/2018 06:35 PM IST
India cannot have two wicketkeepers in the team dilip vengsarkar

టీమిండియా సెలక్టర్ల తీరుపై మాజీ కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తుది జట్టులో ఇద్దరు వికెట్‌ కీపర్లను తీసుకుని ఆడించడంలో అంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలా ఆటడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మొదటి మూడు వన్డే మ్యాచుల్లో మహేంద్ర సింగ్‌ ధోనీ, రిషబ్‌ పంత్‌ ఇద్దరూ ఆడటంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యాలు చేశారు.

అయితే వీరిద్దరూ ఈ బ్యాటింగ్ లో అంతగా రాణించకపోవడం.. టీమిండియా ఓ మ్యాచ్ డ్రా కావడం, మరోటి ఓటమిపాలు కావడంతో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వీరిద్దరిలో ఒకరిని తీసుకుని మరోకరని మంచి యంగ్ బ్యాట్స్ మెన్ తో భర్తీ చేసివుండుంటే ఫలితాలు వేరేగా వుండేవని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధోనీ ఓ గొప్ప క్రికెటర్.. గొప్ప కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఫిట్‌గా కూడా ఉన్నాడు. కానీ, ప్రస్తుతం ఆయన ఆటతీరు బాగోలేదు. అందుకే ఆయన అన్ని ఫార్మాట్లలో ఆడలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు.

కాగా, ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఆడిన ధోనీ, పంత్ లకు గువాహటిలో జరిగిన మొదటి వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ వన్డేలో ప్రత్యర్థి జట్టును టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడించింది. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ధోనీ 20 పరుగులు, రిషబ్‌ పంత్‌ 17 పరుగులు చేశారు. ఈ వన్డే టైగా ముగిసింది. ఇక పుణెలో జరిగిన మూడో వన్డేలో ధోనీ 7, పంత్‌ 24 పరుగులు చేశారు. ఈ మ్యాచులో వెస్టిండీస్‌ బౌలింగ్‌ ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఆలౌట్ అయ్యారు. అయితే దీనిపై స్పందించి కోహ్లీ... ధోనీని కీపర్‌గా, పంత్ ని బ్యాట్స్ మెన్‌గా తీసుకున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Dilip Vengsarkar  India vs West Indies  cricket  sports  cricket  

Other Articles