క్రికెట్ దేవుడిగా ఖ్యాతిగడించిన సచిన్ టెండూల్కర్ తో నూతన అధ్యాయానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం తెరలేపగా, అదే బాటలో ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. మరో లెజెండరీ క్రికెటర్ త్వరలోనే పెద్దల సభలో అడుగుపెట్టనున్నాడా? ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయా? అంటే ఔననే అంటున్నాయి మీడియా వర్గాలు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రఖ్యాత ఆల్ రౌండర్ కపిల్ దేవ్ రాజ్యసభకు నామినేట్ కాబోతున్నారు. రాష్ట్రపతి ఎంపిక చేసే వారి జాబితాలో కపిల్ దేవ్ పేరు ఉండబోతోందని మీడియా వర్గాలు బొగ్గట్టా.
ఈ మేరకు కేంద్రంలోని అధికార బీజేపి పార్టీ చొరవ చూపుతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. రాష్ట్రపతి ఎంపిక చేసే రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభిప్రాయానికి అనుగుణంగా ఉండటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్‌ను పెద్దల సభకు పంపాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టుగా ఆ పత్రిక కథనంలో పేర్కొంది. ఇటీవలే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కపిల్ దేవ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో రాజ్యసభ సభ్యత్వం ప్రస్తావన వచ్చిందని.. కపిల్‌కు షా ఆ హామీ ఇచ్చారని ఆ పత్రిక పేర్కొంది. కేవలం కపిల్ దేవ్‌ను మాత్రమే కాదు, మరో సెలబ్రిటీని కూడా షా కలిశారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లి షా సమావేశం అయ్యారు. ఆమెకు కూడా రాజ్యసభ సభ్యత్వ హామీని ఇచ్చారని... రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యే రాజ్యసభ సభ్యుల్లో మాధురీ దీక్షిత్ పేరు కూడా ఉండబోతోందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56... Read more
Feb 09 | టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన తాజా ట్వీట్ ద్వారా తన అభిమానులతో పాటు టీమిండియా క్రికెట్ అభిమానులను కూడా అందోళనకు గురిచేస్తున్నాడు. ట్విటర్ వేదికగా రిలీజ్ చేసిన వీడియో.. టీమిండియా మాజీ... Read more
Jan 29 | టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాలనే ఆకాంక్ష బలంగా ఉందని టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్, నయావాల్ పుజారా అన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో ఆస్ట్రేలియా పర్యటనపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.... Read more