Record-breaking Rahul returns in style ఆ ముద్రను ఈ అర్థశతకం చెరిపేస్తుంది: రాహుల్

Record breaking kl rahul happy to change perceptions

Andrew Tye,Chris Gayle,Cricket,Delhi Daredevils,Indian Premier League,IPL 2018,IPL 2018 KXIP,Karun Nair,Kings XI Punjab,KL Rahul,Ravichandran Ashwin, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

As KL Rahul smacked a stunning half-century off just 14 balls, one of the on-air commentators remarked that he "would make a superb opening partnership with Chris Gayle".

ఆ ముద్రను ఈ అర్థశతకం చెరిపేస్తుంది: రాహుల్

Posted: 04/09/2018 06:03 PM IST
Record breaking kl rahul happy to change perceptions

తాను టెస్టు క్రికెటర్ అన్న ముద్ర నుంచి బయటపడేందుకు ఐపీఎల్ చాలా దోహదపడుతుందని టీమిండియా బ్యాట్స్ మెన్, ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అశాభావం వ్యక్తం చేశాడు. క్రితం రోజు ఢిల్లీ డేర్ ఢెవిల్స్ తో జరిగిన మ్యాచులో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేసిన రాహుల్.. 14 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో వీర విహారం చేసి జట్టుకు తొలి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. భారీ విజయ లక్ష్యం ముందుండడంతో దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. అయితే, ఇంత గొప్పగా ఆడతానని మాత్రం తానే అనుకోలేదన్నాడు. ఓపెనర్ గా దిగుతున్నాను కాబట్టి వీలైనంత బాగా ఆడాలని, ఎదుర్కొనే ప్రతి బంతినీ పరుగుగా మార్చాలని అనుకున్నానని వివరించాడు. అయితే, అనుకున్న దానికంటే బాగా ఆడానని, ఇదే ఫామ్‌ను మిగతా మ్యాచుల్లోనూ కొనసాగిస్తానని చెప్పాడు. ఐపీఎల్ లోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించానని చెప్పుకొచ్చాడు.
 
రాహుల్ ప్రదర్శనకు తాజా, మాజీ క్రికెటర్లు ముగ్ధులైపోయారు. రాహుల్ ఆటతో జట్టుకు మంచి శుభారంభం లభించిందని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మ్యాచ్‌ అన్నాక గెలుపోటములు సహజమని పేర్కొన్న సాహా, రాహుల్ రికార్డు అర్ధ సెంచరీ సాధించడం, షమీ ఢిల్లీ తరపున ఆడడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్ కు మంచి ఆరంభం లభించిందని మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. రాహుల్ అవుట్ స్టాండింగ్ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడిన ఇర్ఫాన్ పఠాన్ 13 బంతుల్లోనే మరో అర్ధ సెంచరీ సాధించేందుకు ప్రయత్నించాలని సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles