కాశ్మీర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నపాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదికి ఇదివరకే పలువురు టీమిండియా క్రికెటర్ల విమర్శించారు. గౌతమ్ గంభీర్ అయితే మరీ ఘాటుగా రిప్లై పోస్టు చేశాడు. కాగా తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా అఫ్రీదీపై ఘాటుగా విరుచుకుపడ్డాడు. ఇటీవల కాశ్మీర్ లో 12 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిన నేపథ్యంలో స్పందించిన అఫ్రీది.. కాశ్మీర్ ప్రజలపై అణిచివేత తీవ్రంగా కొనసాగుతోందని, అక్కడి ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు ఏమి చేస్తున్నాయని వరుస ట్వీట్లు చేశాడు.
అఫ్రీది ట్విట్లపై యావత్ దేశం నుంచి ఆయనకు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా క్రికెటర్లు సురేష్ రైనా, గౌతం గంభీర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఘాటుగా సమాధానాలిచ్చారు. ఇక తాజాగా సచిన్ కూడా అఫ్రీది ట్వీట్లపై స్పందించాడు. తాము ఏమి చేయాలో బయటి వ్యక్తులు చెప్పాల్సిన పనిలేదన్నాడు. ఇది దేశానికి దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమన్న సచిన్ ఘాటుగా బదులిచ్చాడు. ఇక ఆయన చేసిన ట్విట్ ఇది.. `దేశాన్ని నడిపించే సమర్థమైన నేతలు మనకున్నారు. మనం ఏమి చేయాలో బయటి వ్యక్తులు చెప్పాల్సిన పని లేద`ని సచిన్ అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56... Read more