Sania says Malik is still a 'spring chicken' నెట్ జనుడికి దిమ్మదిరిగే బదులిచ్చిన సానియా..

Sania mirza s witty tweet about husband shoaib malik

Sania Mirza, Shoaib Malik, sania mirza shoaib malik, twitter reactions, cricket, relationship goals, cricket, badminton, cricket news, sports news, latest sports news, sports

Sania Mirza's post about her husband wasn't her only tweet to win hearts on Twitter. Yesterday, her tweet about her father also managed to touch a chord with many tweeple.

నెట్ జనుడికి దిమ్మదిరిగే బదులిచ్చిన సానియా..

Posted: 04/04/2018 07:20 PM IST
Sania mirza s witty tweet about husband shoaib malik

కొందరు క్రీడాకారులపై నెట్ జనులకు ఏమనిపిస్తుందో కానీ వారి మనస్సుల్లో వున్న ప్రతీ అంశాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి ఇబ్బందులు పెట్టేందుకు, లేదా పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొనేందుకు కూడా రెడీ అవుతారు. అయితే వీటిని క్రీడాకారులు పెద్దగా పట్టించుకోరనుకోండి.. ఒక వేళ పట్టించుకుంటే.. ఎలాంటి పరాభవం ఎదురుకావాల్సి వస్తుందో.. అంటే ఈ నెటిజనే ఉదాహరణ. అయితే ఇక్కడ తాను ఒకరిని సంధిస్తూ వ్యంగోక్త ప్రశ్నలు వేయగా, వాటికి సిక్సర్ల లాంటి సమాధానంతో బదులించింది మరో క్రీడాకారిణి.

పాకిస్తాన్ క్రికెటర్ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ను ఓ నెట్ జనుడు టార్గెట్ చేశాడు. షోయబ్ మాలిక్ కి కొంచెం వయసు ఎక్కువంటూ ఆ నెటిజన్ ఈ ట్వీట్ చేశాడు. అది కూడా జట్టులో తాజాగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ క్రికెటర్ ను పోల్చుతూ ఈ ట్విట్ చేశారు. ‘పాకిస్థాన్ X1 జట్టు తరపున షోయబ్ మాలిక్, కొత్త కుర్రాడు షాహీన్ షా అఫ్రిది క్రీడాకారులిద్దరూ ఆడుతున్నారని, 2000 ఏప్రిల్ 6న షాహీన్ జన్మించాడని, అంతర్జాతీయ క్రికెట్ లోకి 1999 అక్టోబర్ 14న షోయబ్ మాలిక్ అడుగుపెట్టాడు’ అని ఆ నెటిజన్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.

దీనికి సానియా స్పందిస్తూ, నెట్ జనుడు తన భర్తపై వేసిన బౌన్సర్ ప్రశ్నకు సిక్స్ కోట్టేలా సమాధానమిచ్చింది. ‘కామన్.. నా భర్త ఇంకా కుర్రాడే..’ అని చెప్పింది. యువ క్రికెటర్ తో కూడా జట్టులో కొనసాగడం అంత ఈజీ కాదు అంటూ కొందరు సానియాకు మద్దతు కూడా పలికారు. పాక్ జట్టులో ఉన్న ఎంతో మంది ఆటగాళ్ల కంటే మాలిక్ భాయ్ చాలా యంగ్ అని, ఈ దంపతులిద్దరినీ ఎంతో ప్రేమిస్తామని, వాళ్లు ఆరోగ్యంగా ఉండాలని, తన ఫిట్ నెస్ కాపాడుకుంటూ ఇంకా టీమ్ లో కొనసాగుతున్నాడని నెటిజన్లు స్పందించడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles