Venkatesh Prasad Resigned for BCCI Key Post | బీసీసీఐకి వెంకటేశ్ ప్రసాద్ రాజీనామా.. కారణం అదేనంట!

Venkatesh prasad resigned bcci

Venkatesh Prasad, BCCI, Junior Selection Committee, Resigned, Venkatesh Prasad BCCI Resign

Team India Former Bowler Venkatesh Prasad resigns as chairman of India's Junior Selection Committee. Citing personal reasons and potential conflict of interest that could arise as he is close to taking up a coaching role with an IPL franchise.

బీసీసీఐకి వెంకటేశ్ ప్రసాద్ రాజీనామా

Posted: 03/03/2018 10:40 AM IST
Venkatesh prasad resigned bcci

టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. క్రికెట్ కు సంబంధించిన వేరే కార్యకలాపాలకు సమయం కేటాయించే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను ప్రసాద్ 30 నెలల పాటు నిర్వహించారు. అయితే భారత అండర్-19 జట్టు నాలుగోసారి ప్రపంచ కప్ ను గెలుచుకున్న కొన్ని రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

వెంకటేష్ ప్రసాద్ రాజీనామాపై బీసీసీఐ స్పందించింది. క్రికెట్ కు సంబంధించిన వేరే కార్యకలాపాలకు సమయం కేటాయించే నేపథ్యంలో వెంకటేష్ ప్రసాద్ రాజీనామా చేశారని బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా తెలిపారు. అయితే, ఎలాంటి అసైన్ మెంట్ ను ఆయన చేపట్టబోతున్నారనే విషయాన్ని రాజీనామాలో పేర్కొనలేదని చెప్పారు.

వెంకటేష్ ప్రసాద్ కు ప్రత్యామ్నాయంగా ఎవర్ని తీసుకోవాలనే విషయాన్ని ఇంతవరకు తాము ఖరారు చేయలేదని తెలిపారు. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే బీసీసీఐ భేటీ అవుతుందని చెప్పారు. జూనియర్ జట్టుకు వెంకటేష్ ప్రసాద్ చేసిన సేవలు అమోఘమని కొనియాడిన ఖన్నా... రానున్న రోజుల్లో కూడా జూనియర్ జట్టు ఘన విజయాలు సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఐపీఎల్ ఫ్రాంఛైజీ జట్టు కోచ్ గా అవకాశం రావటంతోనే ఆయన రాజీనామా చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles