No evidence of Ashes match-fixing, says ICC యాషెస్ సిరీస్ లో ఫిక్సింగ్ కలకలం..

Icc investigation finds no evidence of match fixing in third ashes test

Alex Marshall, Ashes, Ashes test, Australia, Cricket, Cricket News, England, ICC, International Cricket Council, Perth, The Silent Man, World Cup, Sports news, latest news, sports, cricket news, cricket

An investigation was launched following allegations in The Sun newspaper that underground bookmakers from India had offered to sell undercover reporters information about spot-fixing ahead of the game in Perth

ప్రతిష్టాత్మక యాషెస్ లో ఫిక్సింగ్ కలకలం..

Posted: 02/09/2018 06:35 PM IST
Icc investigation finds no evidence of match fixing in third ashes test

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను మ్యాచ్‌ ఫిక్సింగ్‌ భూతం వెంటాడుతోంది. సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ బ్రిటీష్‌ వార్తా పత్రిక ‘ది సన్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాదండోయ్‌ ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం ఇరు జట్ల ఆటగాళ్లను, కోచ్‌లను, టీమ్‌ మేనేజ్‌మెంటును ప్రశ్నించిందని పేర్కొంది.

దీనిపై తాజాగా ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ స్పందించారు. ‘యాషెస్‌ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన టెస్టుపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చింది నిజమే. మాకు అందిన సమాచారం మేరకు ఆటగాళ్లను, కోచ్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాం. కానీ, ఎక్కడా ఆధారాలు లభించలేదు. దీంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం’ అని తెలిపారు.

ఇద్దరు బుకీలు ఆటగాళ్లతో ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, అందులో ఒకరు భారత్‌కు చెందిన వ్యక్తి అని ద సన్‌ పేర్కొంది. పెర్త్‌లో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 4-0తో కైవసం చేసుకుంది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alex Marshall  Ashes  Australia  England  ICC  Perth  World Cup  cricket  

Other Articles