Mentally I'm over cricket: Malinga అరోప్రాణానికి మానసికంగా దూరమవుతున్నా

I don t think i will play international cricket anymore lasith malinga

Indian Premier League, ipl, IPL 2018, Lasith Malinga, Retirement, international cricket, Mumbai Indians, Cricket

Lasith Malinga acknowledged his time as a player in the Indian Premier League is over and expressed a desire to move on. Malinga has struggled because of several injuries and that has impacted his performances in international cricket.

అరోప్రాణానికి మానసికంగా దూరమవుతున్నా

Posted: 02/08/2018 07:03 PM IST
I don t think i will play international cricket anymore lasith malinga

త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తా అంటున్నాడు శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ. తాజాగా మలింగ ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘క్రికెట్‌కు దూరం అయ్యేందుకు మానసికంగా సిద్ధమవుతున్నా. భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాలన్న దాని గురించి ఆలోచించడం లేదు. నా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాను. అందరూ ఏదో ఒక రోజు ఆటకు దూరం కావల్సిన వారే’ అని మలింగ అన్నాడు.

‘దీనిపై ఇంకా శ్రీలంక క్రికెట్‌ బోర్డుతో మాట్లాడలేదు. దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు నా శరీరం ఏ విధంగా సహకరిస్తుందో చూడాలి. ఐపీఎల్‌లోనూ నా కెరీర్‌ ముగిసింది. ముంబయి ఇండియన్స్‌తో కలిసి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాను. మళ్లీ ఆడాలని మాత్రం అనుకోవట్లేదు. ముంబయి ఇండియన్స్‌ నన్ను రిటెన్షన్‌లో తీసుకోలేదని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ముంబయి తరఫున 10ఏళ్లు ఆడాను. ఎన్నో సాధించాను.

ఈ ఏడాది ఐపీఎల్‌ వేలానికి ముందే యాజమాన్యం నాతో సంప్రదింపులు జరిపింది. వచ్చే మూడేళ్ల కోసం మంచి జట్టును తయారు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. యువ ఆటగాళ్లతో పోటీ పడే సామర్థ్యం నాలో తగ్గిపోయిందని నాకు అర్థమైంది. ఇప్పుడు నా వయసు 34. నేను ఏమీ యువకుడిని కాదు కదా. నేను రిటైర్మెంట్‌ యోచనలో ఉన్నప్పుడు ముంబయి ఇండియన్స్‌కు బౌలింగ్‌ మెంటార్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అని మలింగ వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles