Twitter lauds Rahul Dravid and U-19 team అండర్ 19 జట్టుకు, రాహుల్ కు వెల్లువెత్తిన ప్రశంసలు

Twitter lauds india s bahubali dravid after reaching u 19 wc final

INDvPAK, INDvsPAK, PAKvIND, PakvsInd, U19CWC, under19worldcup, U19WorldCup, Rahul Dravid, Twitter, Indias U-19 bahubali, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian colts were lauded for their stupendous display in New Zealand, Indian fans also gave credit to coach Rahul Dravid for guiding the youngsters to the finals once again.

అండర్ 19 జట్టు, రాహుల్ ను కొనియాడిన నెట్ జనులు

Posted: 01/30/2018 05:03 PM IST
Twitter lauds india s bahubali dravid after reaching u 19 wc final

అండర్‌-19 ప్రపంచ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను యువ భారత్‌ చిత్తు చేసి ఫైనల్స్ లోకి ప్రవేశించిన తరుణంలో అటు టీమిండియా అండర్ 19 జట్టుపై ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా జట్టును అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దిన మెంటర్ గా వ్యవహరించిన కోచ్ రాహుల్ ద్రావిడ్ ను ఏకంగా నెట్ జనులు బాహుబలితో పొల్చుతూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాహుల్ వల్లే అండర్19 జట్టు రెండో పర్యాయం ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ కు చేరుకుందని.. యువ జట్టు బాగా రాణించడంలో రాహుల్ తర్పీదు, శ్రమ అధికంగా వున్నాయని కొనియాడుతున్నారు.

గతంలో వెస్టిండీస్ చేతిలో ఫైనల్స్ లో ఓడిపోయి రన్నర్ అప్ గా నిలిచిన జట్టు గతానుభవం దృష్ట్యా ఈ సారి కప్ సాధించాలని కూడా అభిమానులు అకాంక్షిస్తున్నారు. న్యూజీలాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో భారత్ జట్టు సెమీఫైనల్స్ లో పాకిస్తాన్ పై 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత యువకుల ఆటతీరును, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శిక్షణను మెచ్చుకోని వారు లేరు. టీమిండియా ఆటతీరును మెచ్చుకుంటూ పలువురు ప్రముఖులు వరుస ట్వీట్లు పెడుతున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు పాక్‌ అభిమానులు కూడా చేరిపోయారు. రాహుల్‌ను పొగుడుతూ ట్వీట్లు పెడుతున్నారు.

‘భారత్‌ గెలవడానికి వారి వెనక రాహుల్‌ ద్రవిడ్‌ శిక్షణ ఉంది. మరి మా పాకిస్థాన్‌ జట్టు వెనక అలాంటి వారు ఎవరూ లేరు. అందుకే మేం ఓడాం.’ అంటూ పాక్‌ అభిమానులు ట్విటర్‌లో పేర్కొంటున్నారు. పాక్‌ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న మన్సూర్‌ రాణాకు ఎలాంటి అనుభవం లేదని తిట్టిపోస్తున్నారు. ‘మన్సూర్‌ రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. 15 పరుగులే చేశాడు. వికెట్లు ఏమీ తీయలేదు. టెస్టు మ్యాచ్‌ ఆడిన అనుభవం అసలే లేదు’ అంటూ పాక్‌ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. సీనియర్‌ ఆటగాళ్లు ఎవరూ యువ పాక్‌ జట్టుకు సహాయపడేందుకు ముందుకురాకపోవడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : U19WorldCup  Rahul Dravid  Twitter  INDvsPAK  Indias U-19 bahubali  cricket  

Other Articles