ఆతిథ్య దక్షిణాఫ్రికాతో చివరి టెస్టుకు కోహ్లీ సేన సిద్ధమౌతోంది. జొహాన్నస్బర్గ్లోని వాండరర్స్ మైదానంలో బుధవారం నుంచి చివరి టెస్టు మ్యాచు ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే వాండరర్స్ మైదానంలో కోహ్లీ సేన కసరత్తులు చేస్తోంది. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పిచ్ పై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ పిచ్ ప్రాక్టీస్ చేసేందుకు అనుకూలంగా లేదని గమనించిన ఆయన ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కూడా విషయాన్ని చేరవేశాడు.
మూడో టెస్టు కోసం ఆదివారం నుంచి టీమిండియా ప్రాక్టీస్ మొదలెట్టింది. సాధన కోసం ఏర్పాటు చేసిన మూడు ప్రాక్టీస్ వికెట్లను చూసి.. రవిశాస్త్రికి ఫిర్యాదు చేశాడు. వెంటనే శాస్త్రి పిచ్ క్యూరేటర్ తో మాట్లాడి వికెట్లను రీ రోలింగ చేయాలని కోరాడు. దీంతో క్యూరేటర్ వెంటనే సిబ్బందిని పిలిచి వికెట్లను రీ రోలింగ్ చేశాడు. అనంతరం యథావిధిగా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. వాండరర్స్ మైదానం పేసర్లకు బాగా అనుకూలం. ఇప్పటికే ఈ పిచ్ బౌన్సింగ్ బంతులకు అనువైనదని, పేసర్లకు అనుకూలంగా వుంటుందని కూడా క్యూరేటర్ మీడియాకు చెప్పాడు.
ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు కేటాయించిన వికెట్లపై బంతి ఆశించిన స్థాయిలో బౌన్స్ అవ్వకపోవడాన్ని గమనించే రీ రోలింగ్ చేయించాలని రవిశాస్త్రిని కోరినట్లు బంగర్ తెలిపాడు. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో చివరి టెస్టు బుధవారం ప్రారంభంకానుంది. ఇప్పటికే 0-2తో భారత్ సిరీస్‌ను చేజార్చుకుంది. వాండరర్స్ మైదానం టీమిండియాకు అచ్చొచ్చిన మైదానంగా పేరొందింది. ఇక్కడ నాలుగుసార్లు తలపడగా ఒక మ్యాచులో విజయం కైవసం చేసుకోగా మూడింటిని డ్రా చేసింది. చివరి టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే వేచి చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more