most expensive players in IPL history విరాట్ తరువాతే ధోని.. కోహ్లీ రికార్డు..

Virat kohli earns record 2 7 million salary for ipl 2018 campaign

Virat Kohli,Ben Stokes,MS Dhoni,IPL 2018 player retention,Rohit Sharma,Yuvraj Singh,IPL 2018, sports news, sports, cricket news, cricket

Virat Kohli is the most expensive player in the history of the IPL, after being retained by RCB with Rs 17 crore, while Ben Stokes is fifth with Rs 14.5 crore to his name.

విరాట్ తరువాతే ధోని.. కోహ్లీ రికార్డు..

Posted: 01/05/2018 08:11 PM IST
Virat kohli earns record 2 7 million salary for ipl 2018 campaign

ఐపీఎల్‌ అంటేనే అభిమానులకు పరుగుల పండగ. ఆటగాళ్లకు డబ్బుల పండగ. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ ద్వారా ఎందరో స్వదేశీ, విదేశీ క్రీడాకారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఏడాది ఇంకా ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభానికి చాలా సమయం ఉంది. అంతలోనే మన రికార్డుల రారాజు, భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

ఇంతకీ అదేంటంటే.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కింగ్‌ కోహ్లీని తిరిగి సొంతం చేసుకుంది. గరిష్ఠంగా రూ.17 కోట్లు చెల్లించి ఆర్‌సీబీ అట్టి పెట్టుకునే విధానంలో తిరిగి దక్కించుకుంది. సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌ కోసం 2015లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ అత్యధికంగా రూ.16 కోట్లకు వేలంలో పాడుకుంది. ఆ తర్వాత 2017 సీజన్‌ కోసం నిర్వహించిన వేలంలో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ రూ.14.5కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. కోహ్లీ ధర రూ.15కోట్లు ఉండగా ఆర్‌సీబీ మరో రూ.2కోట్లు అదనంగా చెల్లించి మొత్తం రూ.17 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది. 10ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఆటగాడికి ఫ్రాంఛైజీలు ఇంత మొత్తాన్ని ఖర్చు చేయలేదు.

2018 ఐపీఎల్‌ కోసం అట్టి పెట్టుకునే విధానంలో అత్యధిక మొత్తాన్ని దక్కించుకున్న టాప్‌-5 ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

1. విరాట్‌ కోహ్లీ - రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు - రూ.17 కోట్లు
2. మహేంద్ర సింగ్‌ ధోనీ - చెన్నై సూపర్‌ కింగ్స్‌ - రూ.15 కోట్లు
3. రోహిత్‌ శర్మ - ముంబయి ఇండియన్స్‌: రూ.15 కోట్లు
4. స్టీవ్‌ స్మిత్‌ - రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ.12 కోట్లు
5. డేవిడ్‌ వార్నర్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - రూ.12 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Ben Stokes  MS Dhoni  IPL 2018 player retention  Rohit Sharma  Yuvraj Singh  IPL 2018  cricket  

Other Articles