SRH to retain Warner, Dhawan, Bhuvneshwar ఆ ముగ్గుర్ని అట్టిపెట్టుకోనున్న హైదరాబాద్.!

Sunrisers hyderabad to retain warner dhawan bhuvneshwar

cricket, default, ipl_2018, indian_premier_league, sunrisers_hyderabad, david_warner, bhuvneshwar_kumar, shikhar_dhawan, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Sunrisers Hyderabad is going to retain David Warner, Shikhar Dhawan, and Bhuvneshwar Kumar ahead of the mega-auction on January 27 and 28.

ఆ ముగ్గుర్ని అట్టిపెట్టుకోనున్న హైదరాబాద్.!

Posted: 12/27/2017 09:01 PM IST
Sunrisers hyderabad to retain warner dhawan bhuvneshwar

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ పై అప్పుడే అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సారి ఈ జట్టు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తునే.. వేలం ప్రకటన వరకు అగితే ఇంకాస్త క్లారిటీగా చెబుతామని అంటున్నారు అభిమానులు. కాగా, రెండేళ్ల వేటు తరువాత ఈ సారి సీజన్ పున: ప్రవేశం చేయనున్న రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కూడా అద్బుతంగా రాణిస్తాయని తమ జట్టుకు వచ్చిన అపఖ్యాతిని పొగొట్టుకునే ప్రయత్నాలు చేస్తాయని అభిమానులు అశిస్తున్నారు.

అయితే అన్నింటిలోనూ అత్యంత కీలకఘట్టమైన అటగాళ్ల వేలం ప్రక్రియపైనే మొత్తంగా అధారపడి వుందన్నది కాదనలేని విషయం. ఈ తరుణంలో ఏ ఆటగాళ్లు ఏ జట్టు తరఫున బరిలోకి దిగుతారో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఆసీస్ క్రికెట్ సారథి డేవిడ్ వార్నర్ లు సన్ రైజర్స్‌ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నట్లు సమాచారం. పదేళ్ల ఒప్పందం ముగియడంతో వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం నిర్వాహకులు ఆటగాళ్లందర్ని వేలంలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది.

ఐతే ఫ్రాంఛైజీల యాజమాన్యం కోరిక మేరకు ముగ్గురు క్రికెటర్లను తమ జట్టుతో అట్టిపెట్టుకుని మరో ఇద్దరిని రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి పొందేలా అవకాశాన్ని కల్పించడంతో హైదరాబాద్ జట్టు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ లను అట్టిపెట్టుకోనున్నట్లు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రానుంది. ఈ నిర్ధేశిత తేదీలోగా జట్టు యాజమాన్యాలు ఆటగాళ్ల పేర్లను అందజేయాల్సి వుంది. దీంతో ఈ విషయంలో ఏయే జట్లు ఎవరెవర్ని అట్టిపెట్టుకోనున్నాయి అన్నది స్పష్టత రానుంది.

ఇప్పటికే చెన్నై ధోనీ, రైనాను, ముంబయి రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘2016లో హైదరాబాద్‌ జట్టు ట్రోఫీ అందుకోవడంలో ఈ ముగ్గురు ఆటగాళ్లు కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో ఈ ముగ్గుర్నీ తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles