Harbhajan Singh was the biggest prankster భజ్జీతో వుంటే సమయం గడిచిందే తెలియదు

Harbhajan singh was the biggest prankster in the indian dressing room

harbhajan singh, gautam gambhir, prankster, indian cricket team, dressing room, bcci, cricket news, sports news, Team India, cricket, sports, latest sports news, today cricket match, today cricket match score

Gautam Gambhir, in conversation about the Indian dressing room, revealed one of which was about Harbhajan Singh, whom he described as the biggest prankster of the Indian Cricket Team.

భజ్జీతో వుంటే సమయం గడిచిందే తెలియదు

Posted: 12/20/2017 07:02 PM IST
Harbhajan singh was the biggest prankster in the indian dressing room

టీమిండియా డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన మనస్సులోని కొన్ని మాటలను, మరీ ముఖ్యంగా టీమిండియా డ్రెసింగ్ రూమ్ కు సంబంధించిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా భారత జట్టుకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. భారత జట్టులో స్పిన్నర్ హర్భజన్ సింగ్ అతిపెద్ద ప్రాంక్ స్టర్ అని ఆయన తెలిపారు. ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ షోలో గంభీర్ మాట్లాడుతూ... హర్భజన్ ఉంటే అసలు సమయం తెలియదని, అస్సలు బోర్ కొట్టదని అన్నారు.

హర్భజన్ ఓ రాక్‌స్టార్ అని, యువరాజ్ తో పోల్చినా అతడే బెస్ట్ అని పేర్కొన్నాడు. తన అభిమాన క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని ఈ సంద్భంగా గంభీర్ తెలిపాడు. మైదానంలో ప్రశాతంగా ఉండటం ద్రవిడ్ ని చూసి నేర్చుకున్నా అని, అతడితో కలిసి ఆడటం చాలా ఇష్టమని గంభీర్ అన్నాడు. తనకు వన్డేలు, టీ-20ల కంటే టెస్టులు ఆడటమే ఇష్టమని, ఎప్పటికీ టీమిండియా తరఫున ఆడాలనే కోరుకుంటాను. ఒకరి కోసం బ్యాటింగ్‌ చేయాలని నేనెప్పుడూ అనుకోనని గంభీర్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbhajan singh  gautam gambhir  prankster  indian cricket team  dressing room  bcci  cricket  

Other Articles