Dhoni's brain works like magic అది డీఆర్ఎస్ కాదు డీడీఆర్ఎస్..

Ms dhoni s brain works like magic on a cricket field

Cricket,India Cricket Team,MS Dhoni,Jasprit Bumrah,Dhoni DRS video Bumrah,India vs Sri Lanka 1st ODI,Dharamsala,HPCA Stadium,ICC rules on DRS,Dhoni breaks DRS rules, sports news,sports, latest sports news, cricket news, cricket

It is well known to cricketers and fans that MS Dhoni is very accurate with the Decision Review System (DRS). Some have even called it "Dhoni Review System".

అది డీఆర్ఎస్ కాదు డీడీఆర్ఎస్..

Posted: 12/11/2017 07:15 PM IST
Ms dhoni s brain works like magic on a cricket field

టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ అనుభవం జట్టుకు ఎంత అవసరమో తెలిపే ఘటన ఆదివారం శ్రీలంకతో జరగిన తొలి వన్డేలో మరోసారి తెలిసొచ్చింది. వికెట్లు టపటపా రాలిపోతున్న వేళ, భారత జట్టు మరోమారు అతి తక్కువ స్కోరుకు పరిమితమై అపఖ్యాతి మూటగట్టుకోబోతున్న సమయాన బరిలోకి దిగిన ధోనీ తన అనుభవంతో అడ్డకట్ట వేశాడు. 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుత ఆటతీరుతో జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.

ఈ తరుణంలో కుల్దీప్ యాదవ్‌తో కలిసి వికెట్లు పడకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 87 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేసి మరోమారు తానేంటో నిరూపించాడు. అయితే ఈ మ్యాచులో ఇంతకుమించిన ఘటన మరోకటి జరిగింది. శ్రీలంక స్పిన్నర్ పథిరన వేసిన 32వ ఓవర్లో జస్ప్రిత్ బుమ్రా ఎల్బీ అంటూ లంక క్రికెటర్లు అప్పీల్ చేయడంతో.. దానిని పరిగణలోకి తీసుకున్న అంపైర్ ఔట్ అని ప్రకటించే క్రమంలోనే.. ధోని స్పందిందాడు.

అయితే అది ఔట్ కాదని క్షణంలోని వెయ్యో వంతులోనే గ్రహించిన ధోనీ అంపైర్ తన వేలిని పైకెత్తేలోపే డీఆర్ఎస్ కోరాడు. ధోనీ అంచనా నిజమైంది. బంతి ఆఫ్ స్టంప్ పక్క నుంచి వెళ్లేదని సమీక్షలో తేలింది. అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ విషయంలో ధోనీ స్పందించిన తీరు, అతడి క్రికెట్ పరిజ్ఞాన్ని చూసి అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. డీఆర్ఎస్ అంటే.. ధోనీ రివ్యూ సిస్టం అని కొత్త భాష్యం చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles