change in Ind vs Sl 1st odi match timings ఈ డే నైట్ మ్యాచ్ సమయాల్లో మార్పులు చేశారోచ్..

1st odi d n sri lanka tour of india at dharamsala

bcci, india vs sri lanka, ind vs sl, himachal pradesh, darmashala, weather, winter, icc, TeamIndia, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

taking himachal darmashala weather and the health of the players into consideration the bcci has changed the first odi day night match timings.

ఈ డే నైట్ మ్యాచ్ సమయాల్లో మార్పులు చేశారోచ్..

Posted: 12/08/2017 08:32 PM IST
1st odi d n sri lanka tour of india at dharamsala

భారత్ – శ్రీలంకతో వన్డే మ్యాచ్ టైమింగ్స్ మారాయి. డిసెంబర్ 10వ తేదీ ఆదివారం జరగనున్న డే అండ్ నైట్ మ్యాచ్ షెడ్యూల్ మార్చారు. సాధారణంగా వన్డేల్లో డేనైట్ మ్యాచ్‌ అంటే మధ్యాహ్నం 1.30గంటలకు మొదలవుతుంది. రాత్రి పది గంటలకు పూర్తవుతుంది. ఇప్పుడు ఇండియా – శ్రీలంక మధ్య జరగబోయే వన్డే సిరీస్‌లో మొదటి, రెండో వన్డేలు డే-నైట్ మ్యాచ్‌లే అయినా.. ఉదయం 11.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. దీనికి కారణం ఈ మ్యాచ్‌లు జరిగేది ఉత్తర భారతంలో. మొదటి మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో కాగా.. రెండో వన్డే పంజాబ్‌లోని మొహాలీలో జరగనున్నాయి.

అసలే చలికాలం.. అందులోనూ ఉత్తర భారతం.. దట్టమైన పొగ మంచు అక్కడ సర్వసాధారణం. దీంతో రాత్రి మ్యాచ్‌లు ఆలస్యమైతే మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని భావించిన BCCI ఈ రెండు వన్డేలను మాత్రం ఉదయం 11.30కే ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మధ్యే ఢిల్లీలో జరిగిన మూడో టెస్ట్‌లో పొగమంచు, కాలుష్యం కారణంగా శ్రీలంక ఆటగాళ్లు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. మళ్లీ ఇలాంటి పరిస్థితులు రిపీట్ కాకూడదనే మార్నింగ్ సమయంలోనే మ్యాచ్ ప్రారంభిస్తే, చలి, మంచు లాంటి ప్రాబ్లమ్స్ ఉండవని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది బిసిసిఐ.

వైజాగ్ లో జరిగే మూడో వన్డే మాత్రం మధ్యాహ్నం 1.30గంటలకే ప్రారంభం అవుతుంది. ఆదివారం(డిసెంబర్-10) జరిగే తొలి వన్డే కోసం ఇప్పటికే రెండు జట్లు ధర్మశాల చేరుకున్నాయి. శ్రీలంక అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. భారత బౌలర్లు హార్దిక్ పాండ్యా, బుమ్రా, అక్షర్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ధర్మశాల వాతావరణానికి ఫిదా అయిన లంక క్రికెటర్లు.. సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci  india vs sri lanka  himachal pradesh  darmashala  weather  winter  icc  TeamIndia  cricket  

Other Articles