ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగిన తొలి టెస్టులో విజయం అంచుల వరకు చేరిన టీమిండియాకు బ్యాడ్ లైట్ రూపంలో వాతావరణం అనుకూలించక గెలుపును చేజార్చుకున్న విరాట్ సేన.. నాగ్ పూర్ లో మాత్రం చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లోనూ.. మరోవైపు అన్ ఫీల్డ్ లోనూ సమిష్టింగా రాణించిన టీమిండియా.. అద్వితీయ అటతీరుతో అకట్టుకుంది. టెస్టు క్రికెట్ లో తమకు తిరుగులేదని చెప్పనకనే చెప్పేసింది.
వికెట్ నష్టానికి 21 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టును మధ్యాహ్నం లంచ్ విరామం పూర్తైన కాసేటికి అలౌట్ అయ్యింది. దీంతో ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ విజయంతో భారత్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డును సమం చేసింది. రెండో టెస్టు మ్యాచులో శ్రీలంకపై టీమిండియా పూర్తి అదిపత్యాన్ని ప్రదర్శించింది. లంకేయులను చిత్తగా ఓడించి విజయాన్ని అందుకుంది. దీంతో 2007లో ద్రావిడ్ నేతృత్వంలోని జట్టు బంగ్లా జట్టుపై సాధించిన స్కోరునే రిపీట్ చేసింది.
239 పరుగులకు బదులు 240 పరుగులతో విజయాన్ని నమోదు చేసివుంటే దశాబ్దకాలం నాటి రికార్డును బద్దలుకొట్టి విరాట్ సేన తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునే అవకాశాన్ని చేజార్చుకంది. భారత బౌలర్లను ఎదుర్కోనడంలో లంకేయులు పూర్తిగా విఫలమయ్యారు. అటు స్పిన్ ఇటు పేస్ తో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచులో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లను పడగొట్టడం ద్వారా 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఈ టెస్టులో ఐదో పర్యాయం డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీకి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
జట్టు స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 205/10 (79.1 ఓవర్లకు)
భారత్ తొలి ఇన్నింగ్స్ : 610/6 డిక్లేర్ (176.1 ఓవర్లకు)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : 166/10 (49.3 ఓవర్లకు)
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more