kalavati in waiting for dhoni since 13 years ధోని కోసం ఆ తల్లీ 13 ఏళ్లగా నిరీక్షిస్తుందా..?

Kalavati in waiting for dhoni since 13 years

cricket score, 77 year old woman, kalavati, kharagpur, dhoni's domestic help, railway, Team India, MS Dhoni, mahendra singh dhoni, west bengal, india vs australia, india vs australia 2017, india vs australia, india vs australia 2nd t20, ind vs aus, ind vs aus odi, india vs australia odi score, india vs australia match, india vs australia cricket score, hyderabad t20 match, cricket

A 77 year old woman kalavati from kharagpur who worked as dhoni's domestic help when he served railway is in waiting for him since 13 years.

13 ఏళ్ల నిరీక్షణ ఎప్పటికీ ఫలించేనో.. !

Posted: 10/14/2017 12:50 PM IST
Kalavati in waiting for dhoni since 13 years

భారత క్రికెట్‌ దిగ్గజం మహేంద్రసింగ్‌ ధోనీ కోసం ఆ తల్లీ గత 13 ఏళ్లుగా నిరీక్షిస్తూనే వుంది. దోని ఖచ్చితంగా వస్తానని చెప్పాడని, తప్పకుండా వస్తాడని, తన వ్యవహారాలతో బిజీగా వున్నా.. తనకోసమైనా తప్పక వస్తాడని అతని పరామర్శ కోసం ఓ 77 ఏళ్ల మాతృమూర్తి ఎధురుచూస్తుంది. అమె పేరు కళావతి. అమె ధోని కోసం ఎదురు చూడటానికి కారణమేంటీ..? అసలు అమె ధోనికి ఏమవుతుంది. ధోనికి పశ్చిమ బెంగాల్ లోని ఆ మాతృమూర్తికి సంబంధమేమిటీ..? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ధోనీ రైల్వేలో పనిచేసేప్పుడు పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్పూర్ లో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో సౌత్‌సైడ్‌లో రైల్వే ఇచ్చిన ఇంట్లో ఉంటుండేవాడు. ఆ ఇంట్లో వంట తప్ప అన్ని పనులూ కళావతి చేసేది. ఆమెను ధోనీ ‘అమ్మా’ అని సంబోధించేవారు. ఒకసారి ధోనీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆమె తల్లిలా సేవలు చేశారు. అనంతరం భారత్‌ జట్టు తరపున క్రికెట్‌ ఆడేందుకు అవకాశం వచ్చింది.

అక్కడి నుంచి వెళుతూ.. తిరిగి తప్పక కలుస్తానని ధోనీ మాటిచ్చారని, ఇంతవరకు రాలేదని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. గత 13 ఏళ్లుగా ఆమె ఎదురుచూస్తున్నారు. ధోనీ అందరినీ అడిగారని, ‘అమ్మ’ ఎలా ఉందని ప్రశ్నించారని, ఖరగ్‌పూర్‌ వచ్చినప్పుడు తప్పకుండా ఆమెను కలుస్తానని ఇటీవల ఆయనను కలిసిన స్థానికుడైన వాసూరావు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalavati  kharagpur  railway  Team India  MS Dhoni  west bengal  cricket  

Other Articles