Virat kohli led team india to celebrate new year safaris land టీమిండియా న్యూఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే..

Virat kohli led team india to celebrate new year safaris land

India vs south africa, Team India, virat kohli, schedule, virat kohli, new year celebrations, india tour of south africa, bhuvneshwar kumar, jasprit bumrah, india cricket team, India v south africa, hardik Pandya, Bhuvneshwar Kumar,south africa vs india, cricket news, sports news, sports, cricket

team india which tops top rank in icc odi ranking with series of victories in this year is yet to celebrate new year in south africa, as per the shedule declared by SA cricket.

టీమిండియా న్యూఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే..

Posted: 09/28/2017 03:15 PM IST
Virat kohli led team india to celebrate new year safaris land

ఈ ఏడాదిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా అసీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను ఇప్పటికే కైవసం చేసుకుని.. టీ 20 సీరీస్ పై కూడా దృష్టిసారించింది. ఆ తరువాత మరో సిరీస్ అడనున్న టీమిండియాను పరిగణలోకి తీసుకున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. వచ్చే ఏడాదికి కూడా అప్పుడే షెడ్యూలును సిద్దం చేసింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది అరంభంలో దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ పర్యటనకు వెళ్లనున్న విషయం భారత క్రికెట్ అభిమానులకు తెలిసిందే.

దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు టెస్టులు, అరు వన్డేలు, మూడు టీ20లతో మూడు సిరీస్ లను టీమిండియా అడనుంది. కాగా, దీనికి సంబంధించిన షెడ్యూల్ ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే ఈ సిరీస్ జనవరి 5 నుంచి ప్రారంభం కానుండగా, డిసెంబర్ 30న మాత్రం పార్ల్ లో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం జనవరి 5 తేదీన ఇరు జట్ల మధ్య తొలి టెస్టుతో సిరీస్ ఆరంభం కానుంది. దీంతో టీమిండియా అటగాళ్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను కూడా దక్షిణాప్రికాలోనే జరుపుకోనున్నారు.

టెస్టు షెడ్యూల్..

1వ టెస్టు: జనవరి 5 నుంచి 9 వరకూ కేప్ టౌన్ లో
2వ టెస్టు: జనవరి 13 నుంచి 17 వరకూ సెంచూరియన్ లో
3వ టెస్టు: జనవరి 24 నుంచి 28 వరకూ జోహన్స్ బర్గ్ లో

వన్డే షెడ్యూల్..

1వ వన్డే:ఫిబ్రవరి 1, డర్బన్ లో(డే అండ్ నైట్)
2వ వన్డే:ఫిబ్రవరి 4, సెంచూరియన్(డే మ్యాచ్)
3వ వన్డే: ఫిబ్రవరి 7, కేప్ టౌన్(డే అండ్ నైట్)
4వ వన్డే: ఫిబ్రవరి 10, జోహన్స్ బర్గ్(డే అండ్ నైట్)
5వ వన్డే:ఫిబ్రవరి 13, పోర్ట్ ఎలిజబెత్(డే అండ్ నైట్)
6వ వన్డే:ఫిబ్రవరి 16, సెంచూరియన్(డే అండ్ నైట్)

ట్వంటీ 20 షెడ్యూల్..

1వ ట్వంటీ 20: ఫిబ్రవరి 18, జోహన్స్ బర్గ్(డే మ్యాచ్)
2వ ట్వంటీ 20: ఫిబ్రవరి 21, సెంచూరియన్( డే అండ్ నైట్)
3వ ట్వంటీ 20:ఫిబ్రవరి 24, కేపh టౌన్( డే అండ్ నైట్)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles