Bangladesh record first Test win over Australia సొంతగడ్డపై అసీస్ ను మట్టికరిపించిన బంగ్లా..

Bangladesh defeats australia in the first test in dhaka

Shakib Al Hasan, Bangladesh v Australia,David Warner,test match,Shere Bangla National Stadium, Bangladesh Cricket, India vs Sri lanka, cricket news, sports news, sports, cricket

Bangladesh spun their way to a first Test victory over Australia, with Shakib Al Hasan's second five-wicket haul of the match securing a memorable 20-run win inside four days at the Shere Bangla National Stadium.

‘కంగారె’త్తించిన బంగ్లాకూనలు.. తొలిటెస్టులో విజయం..

Posted: 08/30/2017 04:25 PM IST
Bangladesh defeats australia in the first test in dhaka

ఆస్ట్రేలియాతో షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయకేతనం ఎగుర వేసింది. ఆస్ట్రేలియా జట్టుపై 20 పరుగుల తేడాతో గెలిచింది. బుధవారం ఆట ప్రారంభంలో బలమైన పొజిషన్‌లోనే ఉన్నట్టు కనబడిన ఆస్ట్రేలియా మధ్నాహం అయ్యేసరికి వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యం సాధించింది.

టెస్టుల్లో సంచలనం నమోదైంది. ఇప్పటి వరకు వన్డేలకు, పరిమిత ఓవర్ల మ్యాచులలో మాత్రమే తన సత్తాను చాటిన.. దిగ్గజ జట్లను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచంలోనే రారాజులుగా వెలుగొందుతున్న అసీస్ జట్టును పసికూనగా ప్రస్థానం ప్రారంభించి.. ఇటీవలి కాలంలో ఎలాంటి దిగ్గజాలనైనా దీటుగా ఎదుర్కొంటూ.. ధాటిగా ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెట్‌ జట్టు తొలిసారి  అసీస్ జట్టును కంగారెత్తించి రికార్డు విజయాన్ని నమోదు చేసుకుంది. నాలుగురోజుల్లో ముగిసిన ఢాకా టెస్టులో బంగ్లాదేశ్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

స్వదేశంలో ఢాకా వేదికగా షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో అసీస్ అటగాళ్లను హడలెత్తించిన బంగ్లా రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో అధిక్యంలో వుంది. దీంతో రెండో టెస్టు అసీస్ గెలిచిన పక్షంలో సిరీస్ డ్రాగా ముగుస్తుంది. అలా కానీ పక్షంలో డ్రాగా ముగిసినా.. లేక బంగ్లాయే గెలిచినా.. తొలిసారి అసీస్ లాంటి దిగ్గజ జట్టుతో టెస్టు మ్యాచ్ లో విజయాన్ని అందుకున్న జట్టుగా బంగ్లా రికార్డును అందుకుంటుంది. 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగోరోజు 244 పరుగులకు ఆలౌటయింది.

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది.  నాలుగోరోజు ప్యాట్‌ కమిన్స్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 33 పరుగులతో అజేయంగా నిలిచిన అతనికి టెయిల్‌ ఎండర్లు మద్దతుగా నిలువకపోవడంతో 20 పరుగులతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్‌ బౌలర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మరోసారి చెలరేగి.. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన షకీబ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఈ టెస్టులో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. అనంతం ఆడిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 217 పరుగులకే చాప చుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 221 పరుగులు చేయగా.. 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు.. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొలేకపోయారు. షకీబ్‌ (5 వికెట్లు), తైజుల్‌ ఇస్లాం (3 వికెట్లు), మెహిది హసన్‌ (2 వికెట్లు) ధాటికి మరోసారి కంగారుపడి.. 244 పరుగులకు చేతులెత్తేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles