Women's World Cup watched by over 180 million cricket fans ఇంగ్లాండ్ ను తక్కువగా అంచనా వేయలేం

Icc women s world cup 2017 watched by over 180 million cricket buffs

ICC Women's World Cup 2017, India vs England, semi finals, india, England, Harmanpreet kaur, mithali Raj, mandana, deepti sharma, Sri lanka, India Women's Cricket Team, points table, women's world cup points table, cricket news, cricket, sports news, latest news

ICC Women's World Cup in England saw a record coverage with over more than 180 million people being estimated to have watched the prestigious quadrennial tournament and there was an almost 300% increase in viewing hours in comparison to the last edition in 2013.

ఉత్సాహం కన్నా గెలవాలన్న తలంపే అధికంగా వుంది

Posted: 08/11/2017 03:44 PM IST
Icc women s world cup 2017 watched by over 180 million cricket buffs

ఇంగ్లండ్ వేదికగా ఇటీవల ముగిసిన మహిళా ప్రపంచకప్ కు కూడా ప్రేక్షకాదరణ బాగానే వుంది. టోర్నీ అరంభంలో మిథాలీ రాజ్ చేసిన వ్యాఖ్యల కారణమో ఏమో తెలియదు కానీ ఏకంగా ఇటీవల ముగిసిన మహిళా వరల్డ్ కఫ్ కు రికార్డు స్థాయి ప్రేక్షకాదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 18 కోట్ల మంది ఈ టోర్నీని తిలకించినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరని మీడియా ప్రతినిధులు మీధాలీని ప్రశ్నించగా, అమె కౌంటర్ అటాక్ చేసింది. ఇదే ప్రశ్న మీరు క్రికెటర్లను అడగగలరా అని ప్రశ్నించింది. మీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరని మీరు క్రికెటర్లను ప్రశ్నించిన తరవాత అ ప్రశ్నను మాకు సంధించండీ అని అమె బదులీయడంతో అది కాస్తా ప్రపంచకప్ కు ముందు సంచలనంగా మారింది.

ఇక దానికి తోడు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారత జట్టు అతిథ్య జట్టు ఇంగ్లాండ్ తో ప్రారంభమైన టోర్నీ అవే రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అంతకుముందు పర్యాయం  2013లో జరిగిన ప్రపంచకప్ తో పోలిస్తే ఈ సారి ప్రేక్షకాధరణ అధికంగా నమోదైంది. ఈ మెగా టోర్నీ జరుగుతున్న సమయంలో వీక్షించిన వారి సంఖ్య ఏకంగా 18 కోట్లకు చేరగా అది గత వరల్డ్ కప్ తో పోల్చితే 300 శాతం పెరిగినట్లు ఐసీసీ పేర్కొంది. టీవీల ద్వారా ఈ మ్యాచ్ ను అధికంగా వీక్షించిన వారిలో భారత్ , దక్షిణాఫ్రికాలే వున్నాయిని కూడా ఐసీసీ స్పష్టం చేసింది.

భారత్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 15.6 కోట్ల మంది మహిళల ప్రపంచ కప్ ప్రసారాలను వీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది కోట్ల మంది చూడగా, ఒక్క ఫైనల్ పోరును 12.6 కోట్ల మంది వీక్షించారు. భారత జట్టు ఫైనల్ కు చేరడంతో భారత్ లో వీక్షణ సమయం 500 శాతం పెరిగింది. దీనిపై ఐసీసీ  సీఈవో డేవిడ్ రిచర్డ్ సన్ హర్షం వ్యక్తం చేశారు. 'మహిళల క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానిక ఇదే తగిన సమయం. ఈ మెగా టోర్నీతో మహిళల క్రికెట్ ఆదరణ పెరిగింది. దానికి నిదర్శనం ఈ గణంకాలేనని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles