India 344/3 at Stumps after Pujara, Rahane tons శ్రీలంకతో రెండో టెస్టు తొలిరోజు భారత్ అధిపత్యం..

India vs sri lanka 2nd test india 344 3 at stumps after pujara rahane tons

TeamIndia, ind vs sl, shikar dhawan, KL rahul, Virat Kohli, india vs sri lanka, cheteshwar pujara, ajinkya rahane, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Cheteshwar Pujara (128*) and Ajinkya Rahane (103*) forged an unbeaten 211-run stand to power India to 344/3 at stumps on Day 1 of the second Test vs Sri Lanka.

తొలిరోజు టీమిండియా ఆధిపత్యం.. పుజారా, రహానే శతకాలు..

Posted: 08/03/2017 07:25 PM IST
India vs sri lanka 2nd test india 344 3 at stumps after pujara rahane tons

గాలే టెస్టులో విజయంతో దూకుడు మీదున్న టీమిండియా.. అదే జోరును కొలంబో టెస్టులోనూ కనబర్చింది. తొలిరోజు లంకేయులపై పూర్తి అధిపత్యాన్ని కనబర్చింది. బోజన విరామం తరువాత కాసేపు తడబడినట్టుగా కనిపించినా.. ఆ తరువాత పుంజుకుంది. మూడు టెస్టు సిరీస్ లలో భాగంగా అతిధ్య జట్టు శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజన భారత ఆటగాళ్లు రాహుల్, పూజారా, రహానే రాణించడంతో పటిష్టస్థితికి చేరుకుంది. ఫలితంగా తొలిరోజు అట ముగిసే సమయానికి విరాట్ సేన మూడు వికెట్ల నష్టానికి 344 పరుగులను సాధించింది. ప్రస్తుతం పూజారా 128 పరుగులతో, రహానే 103 పరుగులతో క్రీజ్ లో వున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న టీమిండియా.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ దాటిగా అడి స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. రాహుల్ తో కలసి 10 ఓవర్లకే జట్టు స్కోరును 50 పరుగులు జోడించారు. ఆ తర్వాత దిల్రువన్‌ పెరీరా వేసిన బంతికి ధావన్ ‌(35) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగి నిరాశపర్చాడు. ఆ తరవాత వచ్చిన పూజారాకు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్. కెరీర్ లో 50 టెస్టు అడుతున్న పూజారా.. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 53 పరుగులు జోడించారు. లేని పరుగుకు పోయిన రాహుల్ 57 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రాణించలేకపోయాడు. 39వ ఓవర్లో హెరాత్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న కోహ్లీ.. మాథ్యూస్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ క్రమంలో టీమిండియా అటగాళ్లు కొంత తడబాటుకు గురయ్యారు. క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే పూజరాతో కలసి స్కోరుబోర్డును పరుగులెత్తించే పనిలో పడ్డాడు. ఏకంగా 12 ఫోర్లతో తన శతకాన్ని నమోదు చేశారు. అంతకుముందే పూజరా 10 ఫోర్ల సాయంతో శతకాన్ని నమోదు చేశాడు. 50వ టెస్టు ఆడుతోన్న పుజారాకిది 13వ శతకం. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పుజారా-రహానె జోడీ నాలుగో వికెట్‌కి అజేయంగా 211 పరుగులను స్కోరుబోర్డుపై నిలిపింది. లంక బౌలర్లు హెరాత్‌, దిల్రువన్‌ పెరీరా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

పుజారా అరుదైన ఘనత..

తన కెరీర్ లోనే 50వ టెస్టు ఆడుతోన్న పుజారా టెస్టు ప్రారంభం నుంచే ఈ టెస్టుపై అశలను పెట్టుకున్నాడు. తన 50వ టెస్టులో ఖచ్చింతంగా భారీ స్కోరు చేయాలని నిర్ధేశించుకున్న పూజారా.. అదే ధోరణిలో అడుతూ శతకాన్ని నమోదు చేసి అరుధైన ఘనత సాధించాడు. 50వ టెస్టులో శతకాన్ని నమోదు చేసిన చటేశ్వర్ పూజారా దిగ్గజాల సరసన స్థానం పంపాదించాడు. 50 టెస్టుల్లోనే 4వేల పరుగులు పూర్తి చేసిన సునీల్‌ గవాస్కర్‌(4,947), రాహుల్‌ ద్రవిడ్‌(4,315), వీరేంద్ర సెహ్వాగ్‌(4,103) తర్వాతి స్థానంలో నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TeamIndia  Virat Kohli  india vs sri lanka  cheteshwar pujara  ajinkya rahane  cricket  

Other Articles