McGrath mantra to team india bowlers for sri lanka tour మెక్ గ్రాత్ మంత్రం: లంక టూర్లో ఇలా చేస్తే విజయమే

Glenn mcgrath s mantra bowl quick full and straight in sri lanka

glenn mcgrath, india-sri lanka cricket series, pace bowling, fast bowlers, umesh yadav, galle test, indian bowling, ishant sharma, bhuvneshwar kumar, mohammd shami, cricket news, sports news, sports, latest news, cricket

When India tour overseas, it’s seldom been about the resourcefulness of their fast bowlers, but rather the adaptability of their batsmen.

మెక్ గ్రాత్ మంత్రం: లంక టూర్లో ఇలా చేయండీ.

Posted: 07/20/2017 11:10 PM IST
Glenn mcgrath s mantra bowl quick full and straight in sri lanka

శ్రీలంక పర్యటన అనగానే తనకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని, తమ జట్టు సభ్యులు ఎదుర్కొన్న గాయాలు తన కళ్ల ముందుకనిపిస్తాయని, అలా జరగకుండా టీమిండియా జాగ్రత్తలు తీసుకోవాలని అస్ట్రేలియా జట్టు మాజీ పేస్ బౌలర్ మెగ్ గ్రాత్‌ సూచించాడు. ఇక శ్రీలంక జట్టు స్వదేశంలో విధ్వంసకరంగా అడుతుందని, వారిని కట్టడి చేయాలంటే టీమిండియా బౌలర్లు పలు జాగ్రత్తా తీసుకోవాలని ఆయన తనదైన మెళకువలను చెప్పారు. విండీస్ పర్యటన ముగించుకుని వచ్చిన కోహ్లీసేన ఈ నెల 26 నుంచి శ్రీలంకతో 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది.

దీంతో లంక పిచ్‌లపై గుడ్ లెంగ్త్‌, వేగం ఎంత ముఖ్యమో మెక్ గ్రాత్‌ వివరించాడు. త్వరగా బౌలింగ్‌ చేస్తూ ఫుల్ లెంత్ ‌, స్ట్రెయిట్‌ డెలివరీలు విసరాలని సూచించాడు. అయితే వాటిని పదే పదే వేస్తే లంకేయులు వాటిని బౌండరీలు కొట్టి.. భారీ స్కోరును నమోదు చేసే అవకాశాలు వున్నాయని కూడా సూచించాడు. అయితే విరాట్ సేన బౌలింగ్ లో బాగా రాణిస్తుందని చెబుతూనే లంకతో మాత్రం చక్కని స్వింగ్ రాబట్టాలని.. పిచ్ స్పందించే గుణాన్ని బట్టి బంతులు విసరాలన్నాడు.

పేసర్‌ ఉమేశ్‌ యాదవ్ పై ప్రశంసలు కురిపించిన ఆయన కొన్నేళ్లుగా అతడి బౌలింగ్ లో దూకుడు పెరిగిందన్నాడు. నిలకడగా బంతులు విసిరి వికెట్లు తీస్తున్నాడని ప్రశంసించాడు. భువనేశ్వర్‌ కుమార్‌ బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తున్నాడని తెలిపాడు. షమి అద్భుతంగా రివర్స్‌ స్వింగ్ రాబట్టగలడని, ఇషాంత్ శర్మకు మంచి అనుభవం ఉందన్నాడు. వరుణ్ ఆరోన్‌, జస్ప్రీత్ బుమ్రా, బసిల్ థంపి వంటి యువ బౌలర్లు భారత బౌలింగ్ యూనిట్‌ను మరింత దుర్భేద్యంగా మార్చగలరని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : glenn mcgrath  india vs-sri lanka  pace bowling  Team India  Sri lanka  cricket  

Other Articles