World Cup heroes rubbish Arjuna Ranatunga allegations రణతుంగ అరోపణలను ఖండించిన నాటి హీరోలు

Arjuna ranatunga alleges 2011 world cup final between india and sri lanka

arjuna ranatunga, arjuna ranatunga match fixing, 2011 world cup, india vs sri lanka 2011 final, ICC World Cup 2011, India vs Sri lanka, India Cricket Team, world cup 2011, cricket news, cricket, sports news, latest news

Indian cricketers are not exactly amused with Ranatunga’s demands, which also in a way undermines their effort. Gautam Gambhir feels that Ranatunga should back his allegations with evidence.

రణతుంగ అరోపణలను ఖండించిన నాటి హీరోలు

Posted: 07/15/2017 02:19 PM IST
Arjuna ranatunga alleges 2011 world cup final between india and sri lanka

శ్రీలంక మాజీ దిగ్గజ అటగాడు, కెప్టెన్ అర్జున రణతుంగా పేల్చిన బాంబుకు టీమిండియా క్రకిెటర్లు ధీటుగా సమాధానమిస్తున్నారు. 2011 ప్రపంచకప్ లో భాగంగా భారత్-శ్రీలంకల మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆయన సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీమిండియాకు చెందిన ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్.. రణతుంగా తాను చేసిన అరోపణలకు కట్టుబడి వుండాలని సూచించారు. అయితే అరోపణలకు తగ్గ అధారాలను కూడా ఆయన సేకరించుకుని వాటిని కూడా చూపాలని గంభీర్ పేర్కోన్నారు.

2011 ప్రపంచ కప్ ఫైనల్స్ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను షాక్ కు గురి చేసిందని రణతుంగ అన్నారు. అప్పుడు కామెంటేటర్ గా తాను భారత్ లోని ముంబై నగరంలో వున్న వాంఖేడ్ స్టేడియంలోనే ఉన్నానని చెప్పారు. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లతో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి టీమిండియాకు 275 పరుగులు విజయలక్ష్యాన్ని నిర్దేశించిందని అన్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్... అదిలోనే సెహ్వాగ్, సచిన్ వికెట్లను కోల్పోయిందని చెప్పాడు. అప్పటివరకు పటిష్టస్థితిలో వున్న లంక.. అనూహ్యంగా మ్యాచ్ స్వరూపం మారిపోయి ఓటమిపాలవ్వడం తానను షాక్ కు గురిచేసిందని అన్నాడు.

శ్రీలంక బౌలింగ్, ఫీల్డింగ్ రెండూ పేలవంగా మారిపోయాయని... దీంతో, భారత్ విజేతగా నిలిచిందని చెప్పాడు. ఆ మ్యాచ్ లో శ్రీలంక ఆటతీరుపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నాడు. మరోవైపు, రణతుంగ వ్యాఖ్యలను అప్పటి భారత జట్టు సభ్యులు గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాలు ఖండించారు. రణతుంగ ఆరోపణలు తమను ఆశ్చర్యపరిచాయని, ఆయన వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, చూపించాలని అన్నారు. రణతుంగ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఫైనల్స్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేసి, టాప్ స్కోరర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arjuna ranatunga  match fixing  2011 world cup  india vs sri lanka 2011 final  cricket  

Other Articles