10 players from Team India against Anil Kumble as coach? ఈ కోచ్ మాకోద్దు అంటున్న టీమిండియా అటగాళ్లు..

10 players from virat kohli led team india against anil kumble s extension as coach

anil kumble, coach anil kumble, virender sehwag, india cricket coach, icc champions trophy, anil kumble, bcci, sourav ganguly, sunil gavaskar, ICC Champions Trophy 2017, sachin tendulkar, sourav ganguly, tom moody, virat kohli, vvs laxman, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

Team India head coach Anil Kumble, it is now speculated that there are ten players from the current Indian team who are not in favour of Kumble getting an extension.

ఈ కోచ్ మాకోద్దు అంటున్న టీమిండియా అటగాళ్లు..

Posted: 06/07/2017 09:48 PM IST
10 players from virat kohli led team india against anil kumble s extension as coach

టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో అతడి సేవలను కొనసాగించాలా..? లేక మరోకరిని ఆ స్థానంలో తీసుకోవాలన్న అన్న డైలిమాలో ఎటు తేల్చుకోలేకపోయినా.. అటు కోచ్ పదవికి అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవాలని మాత్రం ప్రకటనను ఇప్పటికే జారీ చేసింది బిసిసిఐ. అనిల్ కుంబ్లే సేవలను ఈ నెల 20తో ముగియనుండటం.. దానికి తోడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ముగిసి ఆ తరువాత మరిన్ని పోటీలకు భారత్ సిద్దం కానుండటంతో.. బిసిసిఐ ఇక సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో జట్టు సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, జట్టు మేనేజర్‌ ఎంవీ శ్రీధర్‌, క్రికెట్‌ సలహా మండలి సభ్యుడు గంగూలీ పలు దఫాలుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు కుంబ్లే పర్యవేక్షణపై ఆరోపణలు గుప్పించారు. ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టడాన్ని ఏమాత్రం సహించడని, ప్రాక్టీస్ లో దెబ్బలు తగిలినా పట్టించుకోడని, ప్రాక్టీస్ చేయాల్సిందేనని చెబుతాడని, ఆ సమయంలో మానవత్వం మరచి, రాక్షసుడిలా వ్యవహరిస్తాడని ఫిర్యాదు చేశారు. సుమారు 10 మంది ఆటగాళ్లు ఇదే రకమైన ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

రవిశాస్త్రి అలా కాదని, ఆటగాళ్లతో స్నేహంగా, సరదాగా ఉండేవాడని వారు చెప్పారు. దీనిపై సీనియర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. కుంబ్లే అలా ఉండడం వల్లే జట్టు విజయాల పరంపర కొనసాగిస్తోందని, జట్టు పట్ల కోచ్ కఠినంగా ఉండాల్సి ఉంటుందని, అలా ఉంటేనే సానుకూల ఫలితాలు వస్తాయని, లేని పక్షంలో జట్టు పరాజయాల బాట పట్టే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ప్రాక్టీసే కదా అని కోచ్ అలసత్వం ప్రదర్శిస్తే... ఫలితం కూడా అలానే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  icc champions trophy  anil kumble  sourav ganguly  bcci  cricket  

Other Articles