No Room for Mistakes, Says Kane Williamson అక్కడ తప్పులు చేస్తే దిద్దుకునే అవకాశం వుండదు..

Champions trophy 2017 no room for mistakes says kane williamson

Champions trophy, champions trophy 2017, champions trophy no room for mistakes, kane williamson on champions trophy, Kane Williamson, New Zealand cricket team, New Zealand squad, Williamson, new zealand, kane williamson, mistakes, cricket

New Zealand cricket captain Kane Williamson admits that is no guarantee for success when it comes to one-off clashes in June's Champions Trophy.

అక్కడ తప్పులు చేస్తే దిద్దుకునే అవకాశం వుండదు..

Posted: 05/26/2017 08:51 PM IST
Champions trophy 2017 no room for mistakes says kane williamson

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్వర్యంలో నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీలో తప్పిదాలు చేస్తే దిద్దుకునే అవకాశం వుండదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఏ చిన్న తప్పు చేసినా వాటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా ఆడితేనే ముందుకు వెళతామన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే ఉందని, కానీ ఎంతవరకూ సక్సెస్ అవుతామనే దానిపై మాత్రం గ్యారంటీ లేదని అభిప్రాయపడ్డాడు.

ఈ కాంపిటేషన్లో ప్రతీ మ్యాచ్ కీలకమని, మ్యాచ్లు గెలుస్తూ ఉంటేనే ముందుకు సాగుతామని, అప్పుడే అక్కడ విజయావకాశాలను అందుకునే అవకాశం వుంటుందని అన్నాడు. ఇక్కడ పరిస్థితులు తమకు కలిసొచ్చే అవకాశం ఉందని అన్నాడు. అయితే అది కూడా కొంతవరకూ మాత్రమేనని.. ప్రతీది తమకు అనుకూలంగా ఉండాలంటే ప్రత్యర్థులపై తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకోవాల్సి వుంటుందన్నాడు. ఇక్కడ తేరుకోవడానికి సమయం ఉండదని. గెలుపే లక్ష్యంగా దూసుకుపోవాలన్నాడు. వివిధ వాతావరణ పరిస్థితులతో పాట, పలు జట్లపై ఆడిన అనుభవం తమకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నామని విలియమ్సన్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  new zealand  kane williamson  mistakes  cricket  

Other Articles