spinner Muttiah Muralitharan to mentor TNPL team చిన్నజట్టుకు మెంటర్ గా ముత్తయ్య మురళీధరన్

Former sri lanka spinner muttiah muralitharan to mentor tnpl team

muttiah muralitharan, muralitharan, murali, tamil nadu premier league, tnpl, tnpl cricket, cricket news, cricket, cricket news, latest news

After being part of the Sunrisers Hyderabad unit during the IPL, former Sri Lanka spinner Muttiah Muralitharan is all set to play the role of mentor of a side in the Tamil Nadu Premier League (TNPL).

చిన్నజట్టుకు మెంటర్ గా ముత్తయ్య మురళీధరన్

Posted: 05/26/2017 08:08 PM IST
Former sri lanka spinner muttiah muralitharan to mentor tnpl team

శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ కు యువక్రికెటర్లకు మెళకువలను నేర్పించాలంటే అమితమైన అసక్తి. దేశానికి సంబంధించిన జట్టు ఆటగాళ్లకు మెళకువలు నేర్పించే మురళీధరన్.. చిన్న చితకా టోర్నీ అటగాళ్లకు కూడా స్విన్ పై పట్టు సాధించడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగా రాష్ట్రాలలో నిర్వహించే టోర్నీలకు కూడా ఆయన మెంటర్ గా వెళ్లడమే నిదర్శనం. తాజాగా ఆయనను తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌పీఎల్‌)లోని ఓ ఫ్రాంచైజీ మెంటార్‌గా నియమించుకుంది. ఐపీఎల్‌లో ఇతడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా సేవలందించిన సంగతి తెలిసిందే. జులైలో టీఎన్‌పీఎల్‌ రెండో సీజన్‌ ప్రారంభంకానుంది.

ఈ నేపథ్యంలో వీబీ తిరువల్లూరు వీరన్స్ జట్టుకు ఇక నుంచి మురళీధరన్ మెంటార్ గా వ్యవహరించనున్నట్లు ఆ జట్టు యజమాని, మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడి సలహాలు, సూచనలు ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడతాయన్న నేపథ్యంలోనే మురళీధరన్ ను ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. లీగ్ చివరి వరకు మురళీధరన్ ఆటగాళ్లకు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు. మెంటార్ గా బాధ్యతలు స్వీకరించాలని అడగగానే ఒప్పుకున్న మురళీధరన్ కు ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ ధన్యవాదాలు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles