ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. Dhoni need not prove anything to anyone says Shane Warne

Ms dhoni does not need to prove anything to anyone says shane warne

IPL, Shane Warne, Dhoni, Warne, Rising Pune Supergiant, MS Dhoni, IPL-10, Mahendra Singh Dhoni, Indian Premier League, Cricket

His finishing skills called into question by critics, Mahendra Singh Dhoni received firm backing from spin legend Shane Warne, who feels that former India captain doesn't need to "prove anything to anyone".

ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..

Posted: 04/18/2017 07:02 PM IST
Ms dhoni does not need to prove anything to anyone says shane warne

ఆయన ఎవరకీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గా ఆయన గురించి ప్రపంచమంతా తెలుసునని అన్నారు అసీస్ స్పీన్ దిగ్గజం షేన్ వార్న్. ఐపీఎల్ పదవ సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరపున ఆడుతున్న టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనికి మద్దతు పలికాడు. ఈ సీజన్ లో ధోనికి ఇంకా ఆకట్టుకోలేని తరుణంలో అతనిపై వస్తున్న విమర్శలను వార్న్ కొట్టిపారేశాడు. ధోనికి అండగా నిలిచి వార్న్.. ఆయన గురించి తెలిసిన వారు ఆయన నిరూపించుకోవాలని వ్యాక్యలు చేయరని అన్నాడు. మైదానంలో ధోని తానెంటో నిరూపించుకోవడానికి అతని వద్ద ఇంకేమీ లేదన్నాడు.

ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించిన ధోని.. ఆతని సారథ్యంలోని జట్టు కూడా చారిత్రాత్మక విజయాలను అందుకుందని గుర్తు చేశాడు. వాటిని పక్కనబెట్టి ఎవరి కోసం ఇంకా నిరూపించుకోవాలంటూ వ్యాఖ్యలు చేయడంపై వార్న్ గట్టిగా ప్రశ్నించాడు. ఇప్పుడు ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ లు ఆడనంత మాత్రానా ధోని తన సత్తా నిరూపించుకోవాలంటూ విమర్శించడం తగదన్నాడు. తనకు తెలిసి ధోనికి ఆ అవసరమే లేదని వార్న్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ప్రధానంగా పుణె సూపర్ జెయింట్ యాజమాన్యం ధోనిపై చేసిన విమర్శల నేపథ్యంలోనే వార్న్ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL  Shane Warne  Dhoni  Warne  Rising Pune Supergiant  MS Dhoni  IPL-10  Cricket  

Other Articles