సర్పరాజ్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం Misbah-ul-Haq and Shahid Afridi disagree Sarfaraz Ahmed claims

Misbah ul haq shahid afridi say india not scared of playing pakistan

India v Pakistan, Sarfaraz Ahmad, India, Pakistan, Cricket, Misbah-ul-Haq, Shahid Afridi, India not scared to face Pakistan, India not scared of playing Pakistan: Misbah, India not scared of playing Pakistan: Afridi

Pakistan Test captain Misbah-ul-Haq and Shahid Afridi disagreed with Sarfaraz Ahmed’s claims that teamIndian was scared of playing against Pakistan

సర్పరాజ్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం

Posted: 03/31/2017 05:20 PM IST
Misbah ul haq shahid afridi say india not scared of playing pakistan

పాకిస్తాన్ క్రికెట్ పరిమిత ఓవర్ల కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టీమిండియాపై చేసిన వ్యాఖ్యలకు ఆయన స్వదేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్లే ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికోడుతున్నారు. సర్పరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఏమిటంటారా..? పాకిస్థాన్ తో అడాలంటే టీమిండియా భయపడుతున్నట్లు వుందని అన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలతో టెస్టు జట్టు కెప్టెన్ మిస్భావుల్ హక్, మాజీ కెప్టెన్ షాహీద్ అప్రీదీ విభేధించారు.

లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజం లేదని వారన్నారు. పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటానికి భారత్ జంకుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. సర్పరాజ్ చేసిన వ్యాఖ్యలు అయన వ్యక్తిగత అభిప్రాయమని కుండబద్దలు కోట్టినట్లు చెప్పేశారు. ప్రపంచ దేశాలన్నింటినిలోనూ ధీటుగా రాణిస్తూ అప్రతిహాత విజయాలను సొంతం చేసుకుంటున్న టీమిండియాకు తమ దేశంలో క్రికెట్ అడేందుకు ఎందుకు బయపడుతుందని వారే నిలదీశారు.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా మనతో క్రికెట్ ఆడటానికి ఎందుకు భయపడుతుంది. మనతో మ్యాచ్ లకు వారు సిద్ధం కాలేదనడం, జంకుతున్నారని చెప్పడంలో అర్థరహితమని, ఈ వ్యాక్యలు వాస్తవదూరం. ఈ వ్యాఖ్యలు పూర్తిగా సర్ఫరాజ్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అయితే ఇరు జట్ల మధ్య  ద్వైపాక్షిక సిరీస్ ఎందుకు జరగడం లేదో అందరికీ తెలుసు. అందుకు భారత్ ప్రభుత్వమే కారణం. అంతే కానీ పాక్ తో క్రికెట్ ఆడటానికి భారత జట్టు బెదురుతుందన్న వాదన సరైందికాదని హక్, ఆఫ్రిదిలు అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India v Pakistan  Sarfaraz Ahmad  India  Pakistan  Misbah-ul-Haq  Shahid Afridi  cricket  

Other Articles