ఆ ఫీటుతో యువరాజ్ సరసన మిస్బా ఉల్‌ హక్‌ Misbah-ul-Haq hits six sixes on six consecutive balls

Under fire pakistan captain misbah ul haq does a yuvraj singh

Misbah ul Haq, Hong Kong Twenty20 Blitz, Hung Hom Jaguars, Hong Kong Island United, Yuvraj Singh, Pakistan cricket team, cricket

Misbah-ul-Haq, who has faced retirement talks from Pakistan Cricket Board, hit six sixes in six straight balls for Hong Kong Island United against Hung Hom Jaguars in Hong Kong T20 Blitz

ఆ ఫీటుతో యువరాజ్ సరసన మిస్బా ఉల్‌ హక్‌

Posted: 03/10/2017 06:49 PM IST
Under fire pakistan captain misbah ul haq does a yuvraj singh

పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైన పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్‌ హక్‌ తనలో ఇంకా సత్తావుందని నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సాధించిన అరుదైన ఫీటును తాను చేసి యువరాజ్ పక్కన స్థానాన్ని సంపాదించాడు. హాంకాంగ్‌లో జరుగుతున్న ట్వంటీ-20 బ్లిట్జ్‌ టోర్నీలో తాను ఎదుర్కొన్న ఆరు వరుస బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మిస్బా ఉల్ హక్ కెప్టెన్సీ వహించిన హాంకాంగ్ కింగ్ ఐలాంట్ (హెచ్‌కేఐ) యునైటెడ్ జట్టు ప్రత్యర్థి హాంగ్ హోమ్ జాగ్వార్స్ పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ టోర్నీలో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో హెచ్‌కేఐ యునైటెడ్ కెప్టెన్ మిస్బా.. హాంగ్ హోమ్ జాగ్వార్స్ బౌలర్ వేసిన 19వ ఓవర్లో చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మరో బౌలర్ క్యాడీ వేసిన 20వ ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి నాలుగు బంతులను సిక్సర్లు బాదాడు. దీంతో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్‌ను నమోదు చేశాడు. అసలే స్డేడియంలో గ్యాలరీ చిన్నది కావడంతో తొలి రెండు బంతులను మిస్బా స్డేడియం అవతలికి పంపించాడు. అదే ఓవర్లో ఆఖరి బంతిని మిస్బా ఫోర్ కొట్టాడు.

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన మిస్బా కేవలం 37 బంతుల్లోనే 82 పరుగులు చేయగా ఇందులో నాలుగు పోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మిస్బా జట్టు హెచ్‌కేఐ యునైటెడ్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ హమ్ జాగ్వార్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులకే పరిమితమైంది. దీంతో మిస్బా సేన 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ జట్టులో జోనాథన్ ఫూ ఒక్కడే హాఫ్‌ సెంచరీ (47 బంతుల్లో 77: 4 ఫోర్లు, 6 సిక్సర్లు)తో రాణించడంతో ఓటమి తప్పలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Misbah ul Haq  Hong Kong Twenty20 Blitz  Hung Hom Jaguars  Yuvraj Singh  cricket  

Other Articles