రెండు రోజుల్లో తేలనున్న మిస్బా కెప్టెన్సీ భవితవ్యం Misbah to decide on Test future 'soon'

Misbah s future as test captain still hangs in balance

Misbah-ul-Haq, pakistan, test captaincy, Shehryar Khan, pakistan cricket board, pakistan super leagues, test cricket, twenty 20, cricket

Test skipper Misbah-ul-Haq has decided to call on PCB Chairman Shehryar Khan within the next couple of days to discuss the issue.

రెండు రోజుల్లో తేలనున్న మిస్బా కెప్టెన్సీ భవితవ్యం

Posted: 03/03/2017 08:07 PM IST
Misbah s future as test captain still hangs in balance

తన కెప్టెన్సీ పదవిపై క్లారిటీ లోపించిన నేపథ్యంలో ఇక తాడో పేడో తేల్చుకోవడం కోసం పాకిస్తాన్ టెస్టు క్రికెట్ కెప్టెన్ మిస్బావుల్ హక్.. అ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ను కలవనున్నాడు వెస్టిండీస్ తో త్వరలో సిరిస్ ప్రారంభం కానున్నతరుణంలో తన కెప్టెన్సీపై స్పష్టత తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. సిరీస్ కు ముందు క్లారిటీ కావాలని కోరుతున్న హక్ మరో రెండు రోజుల్లో షహర్యార్ ఖాన్ తో భేటీ కానున్నట్లు తెలిపాడు. విండీస్ సిరీస్ కు ఆటగాడిగా అందుబాటులో ఉంటానని చెప్పాడు.

అదే క్రమంలో కెప్టెన్ గా తానే ఉంటానా?లేక ఎవరినైనా ఎంపిక చేస్తారా? అనేది తేలాల్సి ఉందని అన్నాడు. ఆ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ నిర్ణయిస్తారు. దాని కోసమే రెండు రోజుల్లో షహర్యార్ ను కలిసి వివరణ అడుగుతా?' అని మిస్బా పేర్కొన్నాడు. ఇటీవల పాకిస్తాన్ టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి దిగే ప్రసక్తే లేదని మిస్బా స్పష్టం చేశాడు. తాను ఫిట్ గా వున్న సమయంలో ఎల్లగొట్టేందుకు ప్రయత్నం జరుగుతుందని అరోపించారు. ఏ క్రీడలో అయినా వయస్సుకు ప్రాధాన్యత వుండదని, ఫిట్ నెస్ అనేదే ముఖ్యమన్నాడు. కాగా బోర్డుతో తన కెప్టెన్సీపై తాడోపేడో తేల్చుకునేందుకు మిస్బా రెడీ అయ్యాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles