అటో నడిపిన మాజీ అస్ట్రేలియా క్రికెటర్ Michael Clarke turned an auto-driver in Bangalore's streets

Michael clarke masters art of riding auto rickshaw on indian roads

india vs australia, india australia test, michael clarke, clarke, michael clarke auto, michael clarke tuk tuk, michael clarke three wheeler, virat kohli, kohli, cricket news, cricket, pune pitch test, cricket pitch, sports news, cricket

The former Australian captain Michael Clarke is back in Bangalore and enjoying in a three-wheeler auto-rickshaw which he mentioned as “tuk-tuk.”

అటో నడిపిన మాజీ అస్ట్రేలియా క్రికెటర్

Posted: 03/02/2017 09:23 PM IST
Michael clarke masters art of riding auto rickshaw on indian roads

ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ భారత పర్యటనకు వచ్చిన తమ దేశ జట్టుతో వచ్చినా.. జట్టుకు కాకుండా ఆటలో కామెంటేటర్ గా వ్యవహరిస్తూ సరదాగా గడిపారు. పూణే వేదికగా జరిగిన తొలిటెస్టు మూడు రోజుల వ్యవధిలోనే ముగియడంతో బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్న ఆయన బెంగళూరు రోడ్లపై సంచరిస్తున్న అటోలను చూసి వాటిని నడపాలని సరదాపడ్డాడు. అంతే అలా వెళ్తున్న ఓ ఆటో రిక్షాను పిలిచాడు. ముందుగా డ్రైవర్ పక్కన కూర్చున్న ఆయన అటోను ఎలా నడపాలో నేర్చుకున్నాడు.

అలా కొన్ని క్షణాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఆయన ఇక అగకుండా అటోను డ్రైవ్ చేశాడు. మతాము టక్ టక్ అని పిలుచుకునే ఆటో రిక్షాను భారతీయ రోడ్లపై నడపాలనుకున్నా. అందుకు ముందుగా  కొద్ది నిమిషాలు పాటు శిక్షణ తీసుకున్నా. టక్ టక్ ను నడపడం చాలా సరదాగా ఉందని అన్నాడు. తాను ఇక్కడే క్రికెట్ కెరీర్ ను ఆరంభించా. మళ్లీ బెంగళూరుకు వచ్చినందుకు ఆనందంగా ఉందని క్లార్క్ తెలిపాడు. ఈ మేరకు ఆటో రిక్షాను నడిపిన వీడియోను క్లార్క్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అలస్యమెందుకు మీరూ ఓ లుక్ వేసేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : michael clarke  Auto  three wheeler  bangalore  tuk tuk  Australia  Team India  cricket  

Other Articles

Today on Telugu Wishesh