పూణే టెస్టు: రెండో రోజు భారీ అధిక్యం దిశగా అసీస్ India vs Australia, 24 wickets in two days bring up pitch questions

India vs australia smith defies india aussies lead by 298 on day 2

india vs australia,india vs australia 2017, ind vs aus test, india vs australia pune test, ind vs aus first test, virat kohli, kl rahul, india, australia, cricket news, cricket score, cricket

On a stunning day when India was bowled out for 105 and 16 wickets fell, Steve Smith survived three chances to be the 17th to extend Australia's lead to 298 in the first cricket test

పూణే టెస్టు: రెండో రోజు భారీ అధిక్యం దిశగా అసీస్

Posted: 02/24/2017 06:02 PM IST
India vs australia smith defies india aussies lead by 298 on day 2

భారత్ జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తన రెండో ఇన్నింగ్స్ లో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిన ఆసీస్ కు ఓవరాల్ గా  298 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ రోజు ఆటలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(10), షాన్ మార్ష్(0) లు తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ, ఆ తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.  మూడో వికెట్ కు హ్యాండ్ స్కాంబ్(19) తో కలిసి 38 పరుగులు జత చేసిన స్మిత్.. నాల్గో వికెట్ కు రెన్ షా(31) తో కలిసి 52 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే స్మిత్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్మిత్ (59 బ్యాటింగ్; 117 బంతుల్లో 7 ఫోర్లు), మిచెల్ మార్ష్(21 బ్యాటింగ్;48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు క్రీజ్లో ఉన్నారు.

అంతకుముందు తొలిఇన్నింగ్స్ లో టీమిండియా అసీస్ బౌలర్ల ముంగిట మోకరిల్లింది. టెస్టు మ్యచ్ లో కేవలం నలభై ఓవర్లు మాత్రమే ఆడిన విరాట్ సేన ఇక తమ వల్ల కాదంటూ ఒకరి తరువాత ఒకరు వరుసగా పెవీలియన్ బాట పట్టడంతో విరాట్ సేన కేవలం స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. జట్టులో కేఎల్ రాహుల్ అర్థశతకంతో రాణించినా.. మిగతావారందరూ మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. టీ విరామానికి ముందుగానే ఆలౌట్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఈ రోజు ఆటలో 40.1 ఓవర్లు ఆడిన భారత్ జట్టు 105 పరుగులకే చాప చుట్టేసింది. 94 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయిన భారత్.. మరో 11 పరుగుల వ్యవధిలో మిగతా వికెట్లను కోల్పోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

ప్రధానంగా ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి భారత్ కు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ 33 ఓవర్ లో భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (64), రహానే(13),సాహా(0)లను ఓకీఫ్ పెవిలియన్ కు పంపాడు. ఆపై లయన్ బౌలింగ్ లో అశ్విన్(1)అవుట్ కావడంతో భారత్ వంద పరుగులలోపే ఏడో వికెట్ ను నష్టపోయింది. ఇక ఆపై తేరుకోలేని భారత్  మరో మూడు వికెట్లను కూడా వెంటనే కోల్పోయింది. చివరి మూడు వికెట్లను కూడా ఓకెఫీ సాధించడం విశేషం. ఓవరాల్ గా ఓకీఫ్ ఆరు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా, అతనికి జతగా స్టార్క్ రెండు, హజల్ వుడ్, లయన్ లు తలో వికెట్ తీశారు. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అసీస్కు 165 పరుగుల అధిక్యంలో వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  team india  asutralia  virat kohli  kl rahul  pune test  cricket  

Other Articles