అసీస్ జట్టును భజ్జీ అంత మాటన్నాడా..! Weakest Australian team ever to tour India: Harbhajan Singh

Weakest australian team ever to tour india harbhajan singh

india vs australia, team indai, australia tour of india 2017, virat kohli, harbhajan singh, india, australia, cricket

Senior off-spinner Harbhajan Singh has rated the current Australian team led by Steven Smith as the "weakest ever" in recent times to tour the Indian sub-continent.

అసీస్ జట్టును భజ్జీ అంత మాటన్నాడా..!

Posted: 02/18/2017 08:03 PM IST
Weakest australian team ever to tour india harbhajan singh

ఇప్పటిదాకా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్లలో స్టీవ్‌ స్మిత్‌ కె ప్టెన్సీలోని జట్టే అత్యంత బలహీనంగా కనిపిస్తోందని సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్  సింగ్‌ అభిప్రాయపడ్డాడు. మరోసారి ఈ జట్టుకు భారత్‌ చేతిలో వైట్‌వాష్‌ తప్పదని అన్నాడు. ‘నేను గతంలో అతు్యత్తమ ఆసీస్‌ జట్లతో ఆడాను. నా ఉద్దేశంలో ఇప్పటి జట్టు అత్యంత బలహీనంగా కనిపిస్తోంది. అన్నివిధాలా పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టును పర్యాటక జట్టు నిలువరిస్తుందని అనుకోవడం లేదు.

2013లో జరిగినట్టుగానే మరోసారి 4–0తో వైట్‌వాష్‌కు గురికాక తప్పదు. ఎందుకంటే 2001లో జరిగిన సిరీస్‌లో హేడెన్ , స్లేటర్, గిల్‌క్రిస్ట్, పాంటింగ్, స్టీవ్‌ వాలాంటి ఉద్ధండులున్నారు. ఇప్పటి జట్టులో స్మిత్, వార్నర్‌ వికెట్లను త్వరగా తీస్తే ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లు అశ్విన్ , జడేజాలను దీటుగా ఎదుర్కొంటారని అనుకోవడం లేదు. ఇక్కడి పిచ్‌లపై వికెట్లను ఎలా తీయాలో వారిద్దరికి తెలుసు. వాస్తవానికి  ఈ జట్టుకన్నా ఇంగ్లండ్‌ జట్టే బాగుంది. వారు పలు సందర్భాల్లో 400కు పైగా పరుగులు సాధించారు. వీరి నుంచి అలాంటి ఇన్నింగ్స్‌ను ఆశించలేము’ అని హర్భజన్  తేల్చి చెప్పాడు.

ఐపీఎల్‌లో ఆడిన స్మిత్‌ స్పిన్  బౌలింగ్‌లో మెరుగ్గా ఆడినా అవి ఫ్లాట్‌ పిచ్‌లని, అతడి ఎకు్కవ సెంచరీలు అలాంటి పిచ్‌లపైనే వచ్చాయని గురు్తచేశాడు. నాథన్  లియోన్  నాణ్యవైున స్పిన్నరే అయినప్పటికీ ఇక్కడ విరాట్‌ కోహ్లి, మురళీ విజయ్, రహానే లాంటి బ్యాట్స్‌మెన్ కు బౌలింగ్‌ చేయాల్సి ఉంటుందని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles