వెదవననుకుంటున్నారా..? బిసిసిఐపై మండిపడిన శ్రీశాంత్.. Sreesanth's ban order sent to KCA

Sreesanth to defy bcci and play for ernakulam cricket club

s sreesanth, s sreesanth news, s sreesanth comeback, s sreesanth update, s sreesanth first division cricket, s sreesanth , s sreesanth match fixing, bcci, bcci news, cricket news, sports news, cricket

Sreesanth, who was banned for life by the BCCI due to his alleged involvement in the Indian Premier League spot-fixing scandal of 2013, is all set to return to the playing field.

వెదవననుకుంటున్నారా..? బిసిసిఐపై మండిపడిన శ్రీశాంత్..

Posted: 02/16/2017 08:48 PM IST
Sreesanth to defy bcci and play for ernakulam cricket club

2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అభియోగాలను ఎదుర్కోన్న తరువాత ఢిల్లీ న్యాయస్థానం నుంచి మాత్రం నిర్దోషిగా బయటపడిన టీమిండియా మాజీ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ బిసిసిఐపై మండిపడ్డాడు. తనపై జీవితకాలం నిషేధం విధించామని చెబుతూ.. బిసిసిఐ తను ఎక్కడా క్రికెట్ అడకుండా చేయడం సమంజసం కాదని అన్నాడు. తనను స్కాట్లాండ్ క్రికెట్ లీగ్ లో ఆడకుండా అడ్డుకున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై తీరును తప్పుబట్టారు.

అసలు తన జీవితకాల నిషేధంపై ఎటువంటి అధికారికి పత్రం ఇవ్వని బీసీసీఐ.. ఏ రకంగా తనను క్రికెట్ ఆడకుండా అడ్డుకుంటుందని శ్రీశాంత్ విమర్శించాడు. అసలు తనను క్రికెట్ ఆడకుండా అడ్డుకునే అధికారం బీసీసీఐకి లేదని శ్రీశాంత్ మండిపడ్డాడు. తీహార్ జైలులో తాను వున్నప్పుడు సస్పెన్షన్ లెటర్ ను మాత్రమే ఇచ్చారని, అది కూడా 90 రోజులకు మాత్రమే వర్తించేలా వుందని, తనపై అభియోగాలు వచ్చిన మూడేళ్లు గడిచిన తరువాత కూడా ఇంకా అడ్డుకోవమేంటని అయన ప్రశ్నించారు. అయితే తాను నిర్ధోషి అని న్యాయస్థానం తేల్చిన తరువాత కూడా తనపై జీవితకాలం నిషేధం విధిస్తున్నామని చెప్పడం అర్థరహితమన్నాడు.

తనపై జీవితకాల నిషేధం  విధిస్తూ మీడియాకు మాత్రమే బీసీసీఐ చెప్పిందని కానీ తనకు ఇప్పటివరకూ దానికి సంబంధించి ఎటువంటి అధికారిక లేఖ ఇవ్వలేదని అన్నాడు. తన పట్ల బీసీసీఐ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఉగ్రవాది తరహాలో తనను చూస్తుందని శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. త్వరలో ఎర్నాకుళం క్రికెట్ క్లబ్ తరపున రెండు రోజుల గేమ్ ను ఆడనున్నట్లు శ్రీశాంత్ తెలిపాడు. 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని, అందుకే అతడిపై జీవితకాల నిషేధం విధించామని బోర్డుకు చెందిన అధికారి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : sreesanth match fixing  bcci  sports news  cricket  

Other Articles