విరాట్ వీరవిహారం.. తొలివికెట్ కొల్పోయిన బంగ్లా Virat Kohli, Wriddhiman Saha help India to 687

India vs bangladesh test virat kohli and team s dominance virtually puts match out of visitors hands

India vs Bangladesh, Hyderabad Test, Live Scores, Virat Kohli, Cheteshwar Pujara, Murali vijay, rahane, saha, team india, mushfiqur rahim, hyderabad, bangladesh tour of india 2017, cricket, cricket news, sports news, sports

Virat Kohli's record double ton and Wriddhiman Saha's 106* help India to 687/6 in first innings; Bangladesh 41/1 at stumps.

విరాట్ వీరవిహారం.. తొలివికెట్ కొల్పోయిన బంగ్లా

Posted: 02/10/2017 09:30 PM IST
India vs bangladesh test virat kohli and team s dominance virtually puts match out of visitors hands

హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు దుమ్మురేపారు. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరును సాధించిన టీమిండియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఛటేశ్వర్ పూజరా 83 పరుగుల వద్ద ఔట్ కాగానే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ మురళీ విజయ్తో కలసి బంగ్లా బౌలర్ల పంబరేపాడు. వరుసగా నాలుగు టెస్టు సిరీస్ లలో నాలుగు డబుల్ సెంచరీలని నమోదు చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఔట్ అయ్యి వెనుదిరిగాడు.

బంగ్లాతో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలిఇన్నింగ్స్ ను 687 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో ఆరుగురు బ్యాట్స్ మెన్ ను భారత్ కోల్పోయింది. మన బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ 204 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించగా... మురళీ విజయ్ 108, సాహా 106 (నాటౌట్) పరుగులతో బంగ్లా బౌలర్లను బెంబేలెత్తించారు. వీరికి అండగా పుజారా (83), రహానే (82), జడేజా (60), అశ్విన్ (34) పరుగులు చేశారు. ఓపెనర్ రాహుల్ మాత్రమే కేవలం 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాడు.

టీమిండియా బ్యాట్స్ మెన్లను బంగ్లా బౌలర్లు ఏ తరుణంలో కూడా ఇబ్బంది పెట్టలేక పోయారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3, మెహెది హసన్ మిరాజ్ 2, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. కాగా, ఈ టెస్టు ద్వారా టీమిండియా అరుదైన రికార్డును సోంతం చేసుకుంది. రెండు రోజైన శుక్రవారం టీమిండియా స్కోరు 600 పరుగులకు చేరగానే ఈ ఘనత సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో వరుస మ్యాచ్‌ల్లో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక జట్టుగా టీమిండియా రికార్డు సాధిచింది. భారత్ ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆ జట్టుపై రెండు సార్లు, ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగ్లాపై ఒకసారి 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసింది.

టీమిండియా విసిరిన భారీ టార్గెట్ ను చేధించే క్రమంలో బంగ్లాదేశ్‌ అధిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 687 ప‌రుగుల భారీ ల‌క్ష్యఛేద‌న‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆరంభంలోనే త‌డ‌బ‌డ్డారు. ఆదిలోనే బంగ్లాదేశ్‌ తొలివికెట్ కోల్పోయింది. 15 ప‌రుగుల వ్యక్తిగ‌త స్కోరు వ‌ద్ద టీమిండియా సీమర్ ఉమేష్ యాదవ్ వేసిన అద్భుత బంతి బ్యాట్స్ మెన్ ను బీట్ చేస్తూ బ్యాట్ అంచున తగిలి వెళ్లగా కీపర్ సాహా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో డీఆర్ఎస్ కు వెళ్లడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్ సౌమ్య సర్కార్ వెనుదిరిగాడు. రెండో రోజు అట ముగిసే సమయానికి క్రీజులో టానిమ్ 24, మోమిన‌ల్ 1 పరుగుల‌తో ఉండగా, బంగ్లాదేశ్ స్కోరు వికెట్ న‌ష్టానికి 41 గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Bangladesh  team india  bangladesh  virat kohli  saha  hyderabad  cricket  

Other Articles