పివీ సింధూ బహుమతులపై ఛాంఫ్ విస్మయం Carolina Marin shocked of cash prize PV Sindhu received

Carolina marin shocked at amount of cash prize pv sindhu received after olympics

Rio Olympics 2016, Premier Badminton League 2017, P V Sindhu, Carolina Marin, Badminton, Rio olympics, cash prize, sports

Olympic gold medallist Carolina Marin revealed that she was astonished by the amount of cash prize that her counterpart PV Sindhu had received after returning from the Rio Olympics.

పివీ సింధూ బహుమతులపై ఛాంఫ్ విస్మయం

Posted: 01/12/2017 05:23 PM IST
Carolina marin shocked at amount of cash prize pv sindhu received after olympics

రియో ఒలింపిక్స్ లో రజత పథకం సాధించిన షట్లర్ పీవీ సింధు తెలుగు ఖ్యాతిని అమాంతం పెంచింది. ఈ నేపథ్యంలో, సింధుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీ నజరానాలు ఇచ్చాయి. మొత్తం మీద రూ. 13 కోట్ల మేర నగదును సింధు నజరానాగా అందుకుంది. దీనిపై ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రియో ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించిన సింధుకు అందిన బహుమతుల గురించి విన్నాక..  నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్క రియోలో గెలిచి అమె కోట్లకు పడగలెత్తిందని విస్మయానికి గురైంది.

అయితే ఇదే సందర్బంలో తనకు కూడా తమ ప్రభుత్వం నజరానా ఇచ్చిందని చెప్పిన కరోలినా.. అది సింధు అందుకున్న దాంట్లో పదో, పదిహేను శాతమో మాత్రమే ఉంటుందని.. దీనిని బట్టి పథకాలు గెలిచిన క్రీడాకారులకు భారత్ లో ఎంత ప్రాముఖ్యత వుంటుందో తనకు అర్తమైందని తెలిపింది. కరోలినా మారిన్ ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతోంది. మరోవైపు, సింధుకు అందిన భారీ పారితోషికంపై కరోలినా కోచ్ ఫెర్నాండో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒలింపిక్ ఛాంపియన్లకు భారీ నజరానాలు ఇవ్వడం అభినందించదగ్గ విషయమని ఫెర్నాండో తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles