ఇంగ్లాండ్ తో వన్డే, టీ 20లకు హార్థిక్ పాండ్యా దూరం Hardik Pandya sidelined for six weeks

Hardik pandya suffers hairline fracture out for six weeks

india vs england, ind vs eng, hairline fracture, shoulder injury, Team India, England, india england, hardik pandya, pandya injury, pandya england, india squad england odi, india england odi, cricket news, cricket, sports, sports news

Hardik Pandya has been ruled out of competitive cricket for a minimum of six weeks after the shoulder injury he sustained during the net-session.

ఇంగ్లాండ్ తో వన్డే, టీ 20లకు హార్థిక్ పాండ్యా దూరం

Posted: 11/29/2016 05:58 PM IST
Hardik pandya suffers hairline fracture out for six weeks

ఐపీఎల్ లో అద్భుత ప్రతిభ కనబర్చి.. బ్యాట్స్ మెన్ గా జాతీయ జట్టులో స్థానం సంపాదించి.. ఆ తరువాత ఇటు బౌలింగ్, అటు ఫీల్డింగ్ లలోనూ రాణించి.. టీమిండియా అల్ రౌండర్ గా మారిన క్రికెటర్ హార్థిక్ పాండ్యా.. ఇంగ్లాండ్ తో జరిగే పరిమిత ఓవర్ల మ్యాచులకు దూరం అవుతున్నాడు. మోహాలీ టెస్టు ప్రాక్టీసు సెషన్లో భుజానికి గాయం కావడంతో దానిని పరిశీలించిన జట్టు వైద్యులు అది హెయిర్ ఫ్రాక్చర్ అని తేల్చారు.

ఈ గాయం నుంచి పాండ్యా పూర్తిగా కోలుకుని ఫిట్ నెస్ సంపాదించాలంటే ఆయనకు ఆరువారాల సెలవులు అవసరమని బిసిసిఐ వైద్య బృందం చెప్పడంతో జట్టు యాజమాన్యం అతనికి అరువారాల సెలవు ప్రకటించింది. దీంతో ఆయన ఇంగ్లాండ్ తో జరిగే వన్డేలు, టీ 20లకు కూడా దూరంగా వుండాల్సి వస్తుందన్న వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే గాయంతో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులకు దూరమైన పాండ్యా.. మరోసారి గాయం వెంటాడింది. దీంతో స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే సిరిస్ ను అడే అవకాశం కోల్పోయిన పాండ్యా.. అసీస్ తో సిరీస్ నాటికి పూర్తి ఫిట్ నెస్ సాధించి.. రికార్డులు క్రియేట్ చేస్తాడని అశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Pandya  hairline fracture  shoulder injury  Team India  England  

Other Articles