ఇంగ్లాండ్ ను బౌన్సర్లతో బెంబేలెత్తించిన షమి shami attacks visitors by bouncers and full lengths

Mohammed shami attacks england with bouncers and full lengths

india vs england, virat kohli, kohli, mohali test, mohammed shami, kp, virat kohli vs joe root, kohli vs root, india vs england, ind vs eng, england vs india, cricket, cricket news, sports, sports news

Mohammad Shami bounced out Chris Woakes and Adil Rashid with the second new ball, leaving him with only James Anderson for company

ఇంగ్లాండ్ ను బౌన్సర్లతో బెంబేలెత్తించిన షమి

Posted: 11/29/2016 05:33 PM IST
Mohammed shami attacks england with bouncers and full lengths

పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా పేస్ బౌలర్ మొహ్మద్ షమీ పంబరేపాడు. పేస్ కు అత్యంత ప్రాధాన్యమిచ్చే ఇంగ్లాండ్ జట్టును తన పేస్ తో షమీ బంబేలుత్తించాడు. అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు పదునైన ఫుల్ లెంగ్త్ బంతులను సంధిస్తునే, మరొకవైపు బౌన్సర్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లను హడలెత్తించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో షమీ సాధించిన రెండు వికెట్లు బౌనర్లను సంధించి తీసినవే కావడం విశేషం.

ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ను ఇవాళ కొనసాగించిన ఇంగ్లాండ్.. మధ్యలో కొంత నిలదోక్కుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొత్త బంతిని అందుకోగానే షమీ తనలోని ప్రతిభను కనబర్చాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 84.0 ఓవర్ ను వేసిన షమీ తొలి బంతినే వోక్స్కు బౌన్సర్గా సంధించాడు. దాంతో  వోక్స్ తడబడటంతో ఆ బంతి కాస్త అతని హెల్మెట్ను బలంగా తగిలింది. అదే క్రమంలో అతని హెల్మెట్కు ఉన్న నెక్ గార్డ్ కూడా ఎగిరికిందపడింది.

అయితే వోక్స్కు ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, అదే ఓవర్ రెండో బంతి మరోసారి షమీ బౌన్సర్ వేశాడు. ఈ బంతిని ఆడటానికి మరోమారు ఆందోళనకు గురైన వోక్స్(30).. భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, ఆ తరువాత నాల్గో బంతికి క్రీజ్లోకి వచ్చిన రషిద్ ను కూడా బౌన్సర్ తో షమీ బొల్తా కొట్టించాడు. ఆ బంతిని ఆడబోయి ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న ఉమేశ్ యాదవ్కు క్యాచ్ ఇచ్చాడు. ఇలా తన వంతుగా కూడా షమీ టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  mohammed shami  Team india  test series  mohali test  

Other Articles