అమిత్ మిశ్రాను బలిపశువును చేస్తారా..? Amit Mishra Has Been Made a Scapegoat says Sunil Gavaskar

Amit mishra has been made a scapegoat says sunil gavaskar

India vs England 2016,Amit Mishra,Sunil Gavaskar,Virat Kohli,Cheteshwar Pujara,Anil kumble, India,England,Cricket

Amit Mishra had picked a total of three wickets in Rajkot, including two in England's second innings, and was dropped for the 2nd Test in Visakhapatnam

అమిత్ మిశ్రాను బలిపశువును చేస్తారా..?

Posted: 11/18/2016 07:43 PM IST
Amit mishra has been made a scapegoat says sunil gavaskar

న్యూజీలాండ్ తో సిరీస్ లో అదరగోట్టిన టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రాను.. ఇంగ్లండ్ తో సుదీర్ఘ సిరీస్లో భాగంగా తొలి టెస్టులో వైఫల్యం చెందిన కారణంగా బలిపశువును చేస్తారా..? అని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు. తొలిటెస్టులో వైఫల్యానికి జట్టు సమిష్టిగా కారణమని ఆయన అభిప్రాయపడ్డాడు.. అది కాదని కేవలం అమిత్ మిశ్రా ఒక్కడే బలిపశువు అయ్యాడని గవాస్కర్ విమర్శించాడు. ఆ మ్యాచ్ లో భారత జట్టు మొత్తంగా విఫలమైతే, రెండో టెస్టులో అమిత్ మిశ్రాకు స్థానం కల్పించకపోవడం తనకు ఆశ్చర్యం కల్గించిందన్నాడు.

'రెండో టెస్టు తుది జట్టులో అమిత్ కు చోటు దక్కలేదు. ఈ నిర్ణయం నాకు ఆశ్చర్యం కల్గించింది. తొలి టెస్టులో భారత్ వైఫల్యం చెందితే అమిత్ మిశ్రా బలిపశువును చేశారని నేను అనుకుంటున్నా'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. మరొకవైపు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. సెంచరీల దాహంతో చెలరేగిపోతున్న విరాట్ కోహ్లి ఒక బ్యాటింగ్ లోనే కాదు.. వ్యక్తిత్వంలో కూడా చాలా ఉన్నతమైన వాడని కొనియాడాడు. అతనొక రోల్ మోడల్ అంటూ గవాస్కర్ ప్రశంసించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England 2016  Amit Mishra  Sunil Gavaskar  India  England  Cricket  

Other Articles