రాజ్కోట్ టెస్టు నుంచి ఫాఠాలు నేర్చకున్నాం Learnt valuable lesson in how to draw a Test, says Kohli

Learnt valuable lesson in how to draw a test from rajkot test says kohli

India vs England, rajkot test, virat kohli, test draw, rajkot test, first innings, virat kohli, hit wicket, virat kohli dismissal, virat kohli hit wicket, Team india, first test,day 4,score update,r ashwin,wriddhiman saha,Virat Kohli,hit wicket,Kohli hit wicket,Adil Rashid,India vs England score

India skipper Virat Kohli on Sunday said the critics now cannot question his team's ability to force a draw from tough situations as he dug his heels and led the side to a draw in the series-opener.

రాజ్కోట్ టెస్టు నుంచి ఫాఠాలు నేర్చకున్నాం

Posted: 11/14/2016 06:11 PM IST
Learnt valuable lesson in how to draw a test from rajkot test says kohli

పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో రాజ్ కోట్ వేదికగా జరుగిన తొలి టెస్టులో ద్వారా ఒక అమూల్యమైన విషయాన్ని నేర్చుకున్నామని అంటున్నాడు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇంగ్లండ్తో తొలి టెస్టు ఆద్యంత చూస్తే ఎక్కువ శాతం భారత్ వెనుకబడిన మాట వాస్తవమని.. అయితే ఇటీవల గెలుపును మాత్రమే అలవాటు చేసుకున్న భారత్కు, ఓటమి నుంచి కూడా ఎలా బయటపడాలో ఇంగ్లండ్ తో తొలి టెస్టు నేర్పిందన్నారు. ఆ విలువైన విషయాన్ని రాజ్ కోట్ టెస్టులో నేర్చుకున్నామన్నారు. ఇందు కోసం కృషి చేయడంలో జట్టు సమిష్టిగా రాణించిందన్నారు.

మ్యాచ్ చివరి రోజు ఆటలో బంతి అనుకున్నదాని కంటే ఎక్కువ టర్న్ అవడమే కాకుండా, బాగా బౌన్స్ కూడా అయినట్లు కోహ్లి స్పష్టం చేశాడు. ఆ నేపథ్యంలోనే భారత్ తన రెండో ఇన్నింగ్స్ ఆదిలో కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడిందన్నాడు. అయితే ఈ తరహాలో గేమ్ను రక్షించుకోవడం భారత్ జట్టుకు చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తుందన్నాడు. ఖచ్చితంగా తొలి టెస్టు నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నామన్నారు.

ప్రధానంగా గేమ్ ను ఎలా కాపాడుకోవాలో బాగా అవగతమైనట్లు కోహ్లి అన్నాడు. ఒకవేళ తదుపరి సిరీస్లో మరొకసారి ఇదే పరిస్థితి ఎదురైనా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి పేర్కొన్నాడు. కాగా, ఇప్పటివరకూ విరాట్ కోహ్లి నేతృత్వంలో టీమిండియా 18 టెస్టులు ఆడగా, వాటిలో రెండింట మాత్రమే పరాజయం పాలైంది. అయితే ఇంగ్లండ్ తో సుదీర్ఘ సిరీస్లో ఇకపై కూడా జట్టు సమిష్టిగా కృషి చేస్తుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  rajkot test  virat kohli  test draw  Team india  cricket  

Other Articles